విశాఖపట్టణం:ఆరు రోజుల పాటు తిండి పెట్టకుండా  దివ్యను చిత్రహింసలు పెట్టి చంపారని విశాఖపట్టణం సీపీ ఆర్ కె మీనా చెప్పారు. నిందితులను ఈ హత్య కేసులో దర్యాప్తును మరింత వేగవంతం చేశామన్నారు.

దివ్య హత్య కేసు విషయమై ఆయన స్పందించారు. దివ్య భర్త వీరబాబు, పిన్ని కాంతవేణి స్నేహితుడు కృష్ణ కోసం కూడ గాలింపు చర్యలు చేపట్టామన్నారు.ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని అరెస్ట్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

also read:దివ్య కేసులో వెలుగు చూస్తున్న సంచలన విషయాలు: భర్తతో పాటు పిన్ని కూడ వేధింపులు

హత్య జరిగిన తర్వాత వీరంతా పరారీలో ఉన్నారన్నారు. దివ్య తల్లి, తమ్ముడు, అమ్మమ్మ కూడ 2015లోనే హత్యకు గురయ్యారని నిందితులు చెబుతున్నారన్నారు. అయితే తూర్పుగోదావరి పోలీస్ రికార్డుల్లో మాత్రం మిస్సింగ్ కేసుగా నమోదై ఉంది. ఇప్పటివరకు వారి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదన్నారు.

ఈ  కేసులో అసలు ఏం జరిగిందనే విషయమై విచారణ చేస్తున్నట్టుగా ఆయన తెలిపారు. ఈ ముగ్గురిని రౌడీషీటర్ హత్య చేశారని నిందితులు చెబుతున్నారన్నారు. ఈ విషయమై ఆధారాలను సేకరించేందుకు గాను పోలీస్ టీమ్ ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు.

దివ్యను వ్యభిచారం చేయాలని నిందితులు చిత్రహింసలకు గురిచేశారని ఆయన చెప్పారు.  దివ్య భర్తకు కూడ ఈ కేసులో ప్రమేయం ఉందా అనే కోణంలో కూడ విచారణ చేస్తున్నామన్నారు.