Visakha steel privatisation జనసేనాని నిరసన: మంగళగిరిలో పవన్ కళ్యాణ్ దీక్ష

విశాఖ ఉక్కు ప్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగారు. ఇవాళ సాయంత్రం ఐదు గంటల వరకు ఆయన దీక్ష చేస్తారు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు సాగుతున్నాయి.

Visakha steel privatisation:Pawan Kalyan holds protest at Mangalagiri Janasena Party office

అమరావతి: visakha Steel ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం నాడు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో సంఘీభావ దీక్ష చేపట్టారు.  విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై సీఎం Ys Jagan స్పందించాలని Pawan Kalyan  డిమాండ్‌ చేశారు. ఈ దీక్ష ప్రారంభానికి ముందుగా  ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన అమర జవాన్లకు పవన్ నివాళులర్పించారు. అలాగే విశాఖ ఉక్కు సాధన కోసం ప్రాణాలర్పించిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు.

also read:Nadendla Manohar: తెలంగాణ ఎంపీల లాగా ఎందుకు చేయట్లేదు? : నాదేండ్ల మనోహర్

గన్నవరం నుంచి మంగళగిరిలోని Jana sena ఆఫీస్‌కు వెళ్లేదారిలో వడ్డేశ్వరంలో పవన్ కల్యాణ్ ఆగి శ్రమదానం చేశారు. గుంతలు పడిన రోడ్లకు మరమ్మతులు చేశారు. పార చేతబట్టి స్వయంగా మట్టిని పోశారు.  విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరించవద్దని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు.ఈ విషయమై ఆయన గతంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కలిసి వినతి పత్రం సమర్పించారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల జేఏసీ చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో కూడా గతంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరించకుండా ఉండేందుకు గాను కార్యాచరణను ప్రకటించాలని డిమాండ్ చేశారు. అయితే ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కు సూచించారు.విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతున్నాయి.ఈ ఆందోళనలకు విపక్షాలు మద్దతుగా నిలిచాయి. 

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా  రాష్ట్రంలోని విపక్షాలన్నీ కార్మిక సంఘాల జేఎసీ ఉద్యమానికి మద్దతు ప్రకటిస్తున్నాయి. కేంద్రంలో అధికారంలోని బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ కూడా స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తోంది. అయితే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేది లేదని కేంద్రం తేల్చి చెప్పింది. దీంతో కార్మిక సంఘాలు కూడా తమ ఆందోళనలను ఉధృతం చేయాలని నిర్ణయం తీసుకొన్నారు.  విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.

అప్పటి ప్రజా ప్రతినిధులు పార్టీలకు అతీతంగా రాజీనామాలు కూడా చేశారు. అయితే ప్రస్తుతం ఇదే తరహాలో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని కార్మిక సంఘాల జేఎసీ నేతలు అబిప్రాయపడుతున్నారు. 
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఏపీ అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారు. అయితే పార్లమెంట్ సమావేశాల్లో ఇదే విషయమై ఎంపీలు అడిగిన ప్రశ్నకు ప్రైవేటీకరణ ఆపేది లేదని కేంద్రం స్పష్టం చేసింది.  విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ  కాకుండా అడ్డుకోవడంలో వైసీపీ వైఫల్యం చెందిందని టీడీపీ ఆరోపిస్తోంది. పోస్కో ప్రతినిధులతో మాట్లాడిన తర్వాత ఈ ఉద్యమాన్ని నీరుగార్చేందుకు వైసీపీ ప్రయత్నాలు చేసిందని రెండు రోజుల క్రితం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ సర్కార్ అమలు చేయలేదని చంద్రబాబు విమర్శించారు. మాట తప్పడం, మడమ తిప్పడం జగన్ నైజమని ఆయన సెటైర్లు వేశారు. 

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios