ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా: కుటుంబ సభ్యులతో విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల నిరసన

విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలని కార్మికసంఘాల జేఏపీ డిమాండ్ చేసింది.కుటుంబ సభ్యులతో కార్మికసంఘాల జేఏసీ ఆందోళన నిర్వహిస్తుంది.

Visakha steel plant workers protest in Visakhapatnam

విశాఖపట్టణం:విశాఖ స్టీల్ ప్లాంట్ పై ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టమైన ప్రకటించాలని కోరుతూ  విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మిక  సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు శుక్రవారంనాడు ఆందోళన నిర్వహించారు.కుటుంబ సభ్యులతో కలిసి ఆందోళనకు దిగారు.విశాఖ స్టీల్  ప్లాంట్  ప్రైవేటీకరిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.స్టీల్ ప్లాంట్ ను  ప్రైవేటీకరించవద్దని  కార్మిక సంఘాల జేఏసీ 638 రోజులుగా ఆందోళన నిర్వహిస్తుంది.ఎందరో ప్రాణ త్యాగం కారణంగా విశాఖస్టీల్ ప్లాంట్ ఏర్పాటైన విషయాన్ని కార్మికసంఘాల నేతలు  గుర్తు చేస్తున్నారు..

నష్టాలు వస్తున్నాయనే నెపంతో స్టీల్ ఫ్యాక్టరీని  ప్రైవేటీకరించవద్దని కార్మికసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.  రాష్ట్రంలోని అధికార  వైసీపీ, బీజేపీ సహా ఇతర పార్టీలు కూడ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నాయి.విశాఖస్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించబోమని ప్రధాని స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికుల జేఏసీ నేతలను ప్రధాని వద్దకు తీసుకెళ్తామని గతంలో సీఎం జగన్ కార్మిక సంఘాల నేతలకు హామీ ఇచ్చారు.  అయితే ప్రధాని విశాఖపట్టణం  వస్తున్న నేపథ్యంలో ప్రధానిని కలిసే అవకాశం దక్కితే ఫ్యాక్టరీని నష్టాల బారినపడకుండా తీసుకోవాల్సిన చర్యలపై వివరించాలని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.

alsoread:విశాఖలో ఉద్రిక్తత:కార్మికుల బైక్ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు, రోడ్డుపై బైఃఠాయింపు

విశాఖ స్టీల్ ప్లాంట్ పై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇప్పటికే కార్మిక సంఘాలు  నల్లబ్యాడ్జీలతో నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు ఆందోళన నిర్వహిస్తున్న కూర్మన్నపాలెం జంక్షన వద్ద నుండే ప్రధాని మోడీ రోడ్ షో వెళ్లేలా బీజేపీ  ప్లాన్ చేసింది.ఈ తరుణంలో  కుటుంబాలతో కార్మికలు ఆందోళనకు దిగారు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios