విశాఖపట్టణం:విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం నాడు తన పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు.ఈ మేరకు తన రాజీనామా పత్రాన్ని జర్నలిస్ట్ ఫోరం ప్రతినిధులకు అందించారు. స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా పత్రాన్ని ఆయన అందించారు.

శుక్రవారం నాడు విశాఖపట్టణంలోని కూర్మన్న పాలెం గేటు వద్ద కార్మిక సంఘాల రిలే నిరహర దీక్షలు సాగుతున్నాయి.ఈ దీక్ష శిభిరాన్ని గంటా శ్రీనివాసరావు సందర్శించారు. దీక్ష నిర్వహిస్తున్న కార్మికులకు ఆయన సంఘీభావం తెలిపారు.

also read:విశాఖ స్టీల్ ప్లాంట్: జగన్‌కి టీడీపీ ఎమ్మెల్యే గంటా లేఖ

తన రాజీనామాపై వస్తున్న విమర్శల నేపథ్యంలో ఏ రకరమైన పద్దతిలో రాజీనామా కావాలో ఆ పద్దతిలో రాజీనామా ఇచ్చేందుకు సిద్దమని గంటా శ్రీనివాసరావు ప్రకటించారు.  స్పీకర్ ఫార్మెట్ లో రాజీనామా పత్రాన్ని కార్మికుల దీక్ష శిబిరంలో గంటా శ్రీనివాసరావు జర్నలిస్ట్ ఫోరం ప్రతినిధులకు అందించారు.

ఏ పద్దతిలో రాజీనామా కావాలంటే ఆ రకంగా తయారు చేసిన రాజీనామా పత్రాలపై గంటా శ్రీనివాసరావు సంతకం చేశారు. ఈ రాజీనామా పత్రాలను ఆయన కార్మికుల దీక్ష శిబిరంలో చూపారు. జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడు గంట్ల శ్రీనుబాబుకు గంటా శ్రీనివాసరావు రాజీనామా పత్రాన్ని అందించారు.

గతంలో తన రాజీనామా లేఖను గంటా శ్రీనివాస రావు స్పీకర్ కు పంపించారు. అయితే, అది స్పీకర్ ఫార్మాట్లో లేదని, గంటా శ్రీనివాస రావు ఉత్తిత్తి రాజీనామా చేశారని విమర్శలు వచ్చాయి. దాంతో ఆయన శుక్రవారంనాడు స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా లేఖను రాశారు.