విశాఖపట్టణం:ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లేఖ రాశారు.వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానం చేయాలని ఆయన ఆ లేఖలో కోరారు.

also read:విశాఖస్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ: అసెంబ్లీలో తీర్మానం చేయాలని గంటా డిమాండ్

వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం తీసుకొన్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ప్రధానికి  సీఎం జగన్ లేఖ రాయడంపై సీఎంకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ను మరింత బలోపేతం చేసేందుకు సూచనలు చేయడాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. 

వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై వెంటనే కేబినెట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎంని కోరారు. వైజాగ్ ప్లాంట్ కు సంబంధించి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి, కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

వైజాగ్ ప్లాంటులో పని చేస్తున్న వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని అన్ని పార్టీలు కలసికట్టుగా పని చేయాలని అన్నారు. ఈ అంశంలో అన్ని పార్టీల నేతల అభిప్రాయాలను తీసుకోవడానికి అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.