విశాఖపట్టణం: విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యానికి సమ్మె నోటీసులు ఇచ్చారు కార్మికులు. నిబంధనల ప్రకారంగా 14 రోజుల నోటీసును ఇచ్చారు కార్మిక సంఘాల నేతలు.

ఈ నెల 25వ తేదీ తర్వాత సమ్మెపై కార్మిక సంఘాల నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల 17వ తేదీన అఖిలపక్ష సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారు.ఈ నెల 20వ తేదీన కార్మికుల కుటుంబాలతో బహిరంగ సభ నిర్వహించాలని కార్మిక సంఘాలు బహిరంగ సభను నిర్వహించనున్నాయి.

విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను నిరసిస్తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో  నిరసనకు దిగారు. ప్రతి రోజూ  కార్మిక సంఘాలు  పలు రకాల ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.
విశాఖ స్టీల్ ప్లాంట్  ప్రైవేటీకరణను నిరసిస్తూ   కార్మికులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు.