Asianet News TeluguAsianet News Telugu

ఏజెన్సీ ప్రాంతంలో అలజడి... అనుమానాస్పద కదలికలు: చింతమనేని అరెస్ట్ పై విశాఖ ఎస్పీ కార్యాలయం

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ పై విశాఖపట్నం ఎస్పీ రూరల్ కార్యాలయం వివరణ ఇచ్చింది. 

visakha rural sp office clarification on tdp leader chintamaneni arrest
Author
Visakhapatnam, First Published Aug 30, 2021, 10:14 AM IST

విశాఖపట్నం: తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి అరెస్టయ్యారు. ఆయనను విశాఖ జిల్లా నర్సీపట్నం సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న కారును పట్టుకున్నామని... అందులో దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ను అరెస్ట్ చేసినట్లు విశాఖ రూరల్ జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. 

''మాకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు విశాఖ జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత మారుమూల ఏజెన్సీ ప్రాంతాలు, గ్రామాల్లో  ప్రత్యేకంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేశాం. గంజాయి సాగు, సరఫరాతో పాటు చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, మూగజీవాల అక్రమ రవాణా, మావోయిస్టు సానుభూతి పరుల కదలికలపై చెక్ పోస్ట్ వద్ద విస్తృత తనిఖీలను నిర్వహిస్తున్నాం'' అని ఎస్పీ కార్యాలయం వెల్లడించింది. 

read more  టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని అరెస్ట్

''అయితే దారకొండ ఏజెన్సీ ప్రాంతానికి పదికి పైగా వాహనాల్లో కొంతమంది వచ్చి ఇక్కడ అలజడి సృష్టించి వెళ్తున్నట్లుగా స్థానిక గ్రామస్తుల నుండి మాకు(పోలీసులకు) సమాచారం అందింది. దీంతో చెక్ పోస్ట్ సిబ్బందిని అలెర్ట్ చేసి వాహనాలు తనిఖీలు జరుపుతుండగా ఓ వాహనంలో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తిని మా సిబ్బంది గుర్తించారు. ప్రాథమిక విచారణలో అనుమానాస్పదంగా వాహనంలో ఏజెన్సీ గ్రామాల్లోకి వెళ్లేందుకు వచ్చిన వ్యక్తి మాజీ ఎం‌ఎల్‌ఏ చింతమనేని ప్రభాకర్ గా గుర్తించాం'' అని తెలిపారు. 

''అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు చెబుతూ పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తుండటంతో చింతమనేని ప్రభాకర్ ను అదుపులో తీసుకున్నాం. చింతమనేని ప్రభాకర్ తో పాటు మరికొన్ని వాహనాలను స్వాధీనం చేసుకున్నాం. చింతమనేనితో పాటు వచ్చిన మరో 8 నుండి 10 వాహనాల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు జరుపుతున్నాం'' అని విశాఖపట్నం రూరల్  ఎస్పీ కార్యాలయం వెల్లడించింది.  

Follow Us:
Download App:
  • android
  • ios