విశాఖపట్నం: రెండు రోజుల ఆరిలోవ లో జరిగిన  రౌడీ షీటర్ కోరాడ సాయి కుమార్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ విషయాన్ని ద్వారకా ఏసీపీ మూర్తి ఎంవీపీ కాలనీలోని టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరించారు.  ఈ నెల 26 వ తేదీన.. బైక్ పై వెళ్తున్న రౌడీ షీటర్ సాయి ను అడ్డగించి రియాజ్, పండు అనే ఇద్దరు వ్యక్తులు  రాడ్ తో దాడి.. కత్తితో మెడ కోయడంతో సాయి తీవ్రంగా గాయపడ్డాడు. 

రోడ్డు పై కుప్పకూలిన సాయిని చికిత్స కోసం స్థానికంగా ఉన్న పినకిల్ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడన్నారు. ఈ కేసుకు సంబందించి రియాజ్, బడ్డు,పండు నిందితులు ను అదుపులోకి తీసుకున్నామన్నారు. కాగా నిందితుల్లో ఒక మైనర్ ఉన్నాడ ని తెలిపారు.  హత్యకు గురైన వ్యక్తి.. నిందితుల్లో ముగ్గురు స్నేహితులు కావడం గమనార్హం. 

అయితే ఆ ముగ్గురితో స్నేహం వద్దని సాయి భార్య అతనికి చెప్పడంతో.. స్నేహితులను సాయి దూరం పెట్టడం ప్రారంభించాడు. చెడు తిరుగుళ్ళు తిరగవద్దని కూడా చెప్పడంతో.. నిందితులు సాయి పై కక్ష పెంచుకున్నారు. 

అందరి ముందు తమను  సాయి అవమానించారంటూ..  అతడిని అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే రాత్రి దాడికి పాల్పడ్డారు. ఇదిలా ఉండగా దాడికి ఉపయోగించిన ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై రౌడీ షీట్ తెరుస్తామని  తెలిపారు.