విశాఖపట్నం: విశాఖపట్నంలో కలకలం రేపుతున్న కిడ్నీ రాకెట్ కేసు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కిడ్నీ రాకెట్ విషయంలో త్రిసభ్య కమిటీ విచారణ చేపట్టింది. 

ఇప్పటికే శ్రద్ధ ఆస్పత్రి వైద్యులు, బాధితుల నుంచి వివరాలు సేకరించిన త్రిసభ్య కమిటీ కిడ్నీ ట్రాన్స్ స్లాంటేషన్ ఆపరేషన్లపై ఆరా తీసింది. అయితే ఇప్పటి వరకు శ్రద్ధ ఆస్పత్రిలో 66 కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ ఆపరేషన్లు జరిగినట్లు వెలువడటంతో త్రిసభ్య కమిటీ సభ్యులు నివ్వెరపోవాల్సిన పరిస్థితి నెలకొంది.  

50 కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కు సంబంధించి పూర్తి ఆధారాలు త్రి సభ్య కమిటీ సేకరించినట్లు తెలుస్తోంది. అయితే గురువారం కూడా మరోసారి శ్రద్ధ ఆస్పత్రిని త్రి సభ్య కమిటీ తనిఖీ చేయనుంది. ఆస్పత్రి యాజమాన్యాన్ని విచారించేందుకు త్రి సభ్య కమిటీ 30 ప్రశ్నలను సిద్ధం చేసింది. 

మరోవైపు మహారాణి పేట పోలీసులకు త్రి సభ్య కమిటీ లేఖ రాసింది. కేసు వివరాలు ఇవ్వాలంటూ లేఖలు రాసింది. ఇప్పటి వరకు నమోదైన కేసులపై వివరాలు సమర్పించాలని పోలీసులను కోరింది. 

సాయంత్రం కేసు వివరాలను త్రి సభ్య కమిటీకి అందజేసేందుకు పోలీసులు సన్నద్ధమవుతున్నారు. ఇకపోతే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ విషయంలో భారీగా అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో త్రి సభ్య కమిటీ చాలా లోతుగా విచారణ చేపడుతుంది. 

 

ఏషియా నెట్ న్యూస్ లో ఎన్నికల తాజా వార్తలు, విశ్లేషణలు.. ఇక్కడ క్లిక్ చేయండి