చిత్తూరు:  చిత్తూరు జిల్లాలో  కులాంతర వివాహం చేసుకొన్న కూతురిని కుటుంబసభ్యులు అత్యంత దారుణంగా హత్య చేయడంతో  గ్రామస్తులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. నిందితుడి ఇంటిని గ్రామస్తులు ధ్వంసం చేశారు.

దళిత కుటుంబానికి చెందిన కేశవులును అగ్రవర్ణానికి చెందిన  హేమావతి వివాహం చేసుకొంది. ఈ దంపతులకు వారం రోజుల క్రితమే మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆసుపత్రి నుండి  ఇంటికి వస్తున్న బాధితురాలు హేమావతిని బలవంతంగా కుటుంబసభ్యులు తీసుకెళ్లి హత్య చేశారు. 

మృతదేహాన్ని  బావిలో పారేశారు. రెండేళ్లుగా కేశవులును హేమావతి కుటుంబసభ్యులు బెదిరిస్తున్నారుద. ఈ విషయమై కేశవులు పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు పట్టించుకోలేదని బాధిత కుటుంబం ఆరోపణలు చేస్తోంది.

హేమావతిని హత్య చేసిన తర్వాత  తల్లిదండ్రులు గ్రామం నుండి పారిపోయారు.  హేమావతిని అత్యంత పాశవికంగా హత్య చేసిన విషయాన్ని తెలుసుకొన్న గ్రామస్తులు  హేమావతి తండ్రి భాస్కర్ నాయుడు  ఇంటిని ధ్వంసం చేశారు.  

అదే సమయంలో అక్కడికి చేరుకొన్న పోలీసులు గ్రామస్తులను అడ్డుకొన్నారు. భాస్కర్ నాయుడు గ్రామానికి వస్తే తగిన బుద్ది చెబుతామని  కేశవులు బంధువులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత వార్తలు

కులాంతర వివాహం: కూతుర్ని చంపిన తండ్రి