చిత్తూరు: చిత్తూరు జిల్లా ఉసరపెంటలో పరువు హత్య జరిగింది. కులాంతర వివాహం చేసుకొందనే నెంపతో  తల్లిదండ్రులే కూతుర్ని హత్య చేశారు. మృతదేహాన్ని బావిలో వేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

తమ మాట వినకుండా వేరే కులానికి చెందిన వ్యక్తిన వివాహం చేసుకొందని  కుటుంబసభ్యులు కక్ష పెంచుకొన్నారు. ఏడాది క్రితం ఆ యువతి తాను ప్రేమించిన యువకుడిని వివాహం చేసుకొంది. ఇటీవలనే ఆమె ఓ  మగబిడ్డకు జన్మనిచ్చింది.

బిడ్డను తీసుకొని స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో  కుటుంబసభ్యులు వెంటాడి  హత్య చేశారు. మృతదేహాన్ని  బావిలో వేశారు. ఈ విషయమై బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కూతురిని తానే హత్య చేసినట్టుగా తండ్రి భాస్కర్ నాయుడు పోలీసుల ముందు ఒప్పుకొన్నాడు.