విజయనగరం:  విజయనగరంలో  విషాదం చోటు చేసుకొంది. సరైన రహదారి లేకపోవడంతో నాగరాజు అనే వ్యక్తిని డోలి సహాయంతో  15 కి.మీ దూరంలో ఉన్న ఆసుపత్రిక తరలించారు.  ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నాగరాజు మృతి చెందాడు.

విజయనగరం జిల్లాలోని శృంగవరపు కోట మండలం వల్లపుదుంగాడకు చెందిన   నాగరాజు వారం రోజులుగా  పచ్చ కామెర్లతో బాధపడుతున్నాడు.  పచ్చ కామెర్లతో బాధపడుతున్న నాగరాజును 15 కి.మీ దూరంలో ఉన్న శృంగవరపు కోటలోని ఆసుపత్రికి కుటుంబసభ్యులు తీసుకెళ్లారు. 

Also read: 20 కి.మీ నడిచిన గర్భిణీ: రక్త స్రావంతో తల్లీ బిడ్డ మృతి

తమ గిరిజన గూడెనికి రహదారి సౌకర్యం లేకపోవడంతో వాహనాలు వచ్చే అవకాశం లేదు.దీంతో  వారం రోజులుగా  పచ్చకామెర్లతో బాధపడుతున్న నాగరాజును ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు  కుటుంబసభ్యులు డోలిని ఆశ్రయించారు.  

డోలిలో నాగరాజును తీసుకొని 15 కి.మీ పాటు కాలినడకన  శృంగవరపుకోట ఆసుపత్రికి తీసుకెళ్లారు.అయితే పచ్చకామెర్లతో తీవ్రంగా అస్వస్థతకు గురైన  నాగరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం నాడు మృతి చెందాడు.

రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలకు సరైన రహదారి సౌకర్యం లేక ఈ తరహ ఘటనలు చోటు చేసుకొంటున్నాయి. ఈ తరహ ఘటనలు జరిగన సమయంలో అధికారులు హడావుడి చేస్తున్నారు. కానీ ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. దీంతో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి.