విశాఖపట్టణం: టెక్నాలజీలో దూసుకెళ్తున్నా కూడ ఏజెన్సీలో వైద్యం కూడ దొరకక గిరిజనులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఘటనలు చోట చేసుకొంటున్నాయి. వైద్యం కోసం 20 కి.మీ దూరం నడిచిన ఓ నిండు గర్భిణీ ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకొంది.ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.

విశాఖపట్టణం జిల్లా పెదబయలు మండలం జమదంగికి చెందిన నిండు గర్భిణీ బొయితిలోని ఆర్ఎంపీ వైద్యుడి వద్దకు వెళ్లింది. ఆర్ఎంపీ వైద్యుడి వద్ద చికిత్స తీసుకొని తిరిగి తన గ్రామానికి బయలుదేరింది.

జమదంగి నుండి జి.మాడుగుల మండలం బొయితి గ్రామానికి 20 కి.మీ. దూరం. తిరుగు ప్రయాణంలో లక్ష్మికి నొప్పులు వచ్చాయి,. దీంతో బంధువులు ఆమెను డోలిలో ఇంటికి తీసుకెళ్లారు. లక్ష్మీకి తీవ్ర రక్తస్రావమైంది.

తల్లి బిడ్డ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయం తెలుసుకొన్న రెవిన్యూ అధికారులు బాధిత కుటుంబ వివరాలను అడిగి తెలుసుకొని ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చారు.ఇటీవలనే ఇదే ప్రాంతంలో వైద్యం కోసం 15 కి.మీ దూరం గర్భిణీని డోలీలో తీసుకెళ్లారు. రోడ్డు సౌకర్యం లేని కారణంగా కుటుంబసభ్యులు ఆమెను డోలీలో తీసుకెళ్లారు.

సంబంధిత వార్తలు

డోలిలో గర్బిణీని 5 కి.మీ మోసుకెళ్లిన గ్రామస్తులు