ప్రేమ పేరిట మైనర్ బాలికపై వాలంటీర్ వేధింపులు, అత్యాచారం !!

ప్రేమ పేరిట మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడుతూ,  అత్యాచారానికి పాల్పడిన వలంటీర్ ఉదంతం గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చుండూరు మండలంలోని మున్నంగివారిపాలెం వార్డు వలంటీర్‌ గరిక పవన్‌ అదే మండలానికి చెందిన ఎనిమిదో తరగతి బాలికపై కన్నేశాడు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 

Village volunteer in Andhra Pradesh booked for attempting to sexually assault minor - bsb

ప్రేమ పేరిట మైనర్ బాలికపై వేధింపులకు పాల్పడుతూ,  అత్యాచారానికి పాల్పడిన వలంటీర్ ఉదంతం గుంటూరు జిల్లాలో వెలుగుచూసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. చుండూరు మండలంలోని మున్నంగివారిపాలెం వార్డు వలంటీర్‌ గరిక పవన్‌ అదే మండలానికి చెందిన ఎనిమిదో తరగతి బాలికపై కన్నేశాడు. ప్రేమ పేరుతో మాయమాటలు చెప్పి పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 

ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంట పడుతూ కొన్ని రోజులుగా వేధిస్తున్నాడు. అత్యాచారం కూడా చేసినట్టు, బాలిక ఇంట్లో విషయం తెలియడంతో ఆమె తండ్రి మూడు రోజుల క్రితం చుండూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే వలంటీరు చుండూరు తాసిల్దార్ కారు డ్రైవర్ కూడా కావడం, పై అధికారుల ఒత్తిడి కారణంగా పోలీసులు కేసు నమోదు చేయకుండా కాలయాపన చేస్తున్నారని, కొందరు చేసుకోవాలని తమపై ఒత్తిడి చేస్తున్నారని ఆమె తండ్రి ఆరోపించారు.

ఈ నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆయన తెనాలి డీఎస్పీ స్రవంతీ రాయ్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నాడు. కాగా దీనిపై డిఎస్పి విచారణ జరిపించారని,  వాలంటీర్ పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని చుండూరు ఎస్సై సుహాసిని చెప్పారు. 

ఈ కేసు విషయంలో తమపై ఎవరి ఒత్తిడి లేదన్నారు. పవన్ పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష, ప్రజాసంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారంపై తహసిల్దార్ స్పందిస్తూ.. పవన్ తన కారు డ్రైవర్ కాదని.. అత్యవసర సమయాల్లో ఒకటి రెండుసార్లు మాత్రమే పిలిపించామని చెప్పారు. నేరం చేసిన వారు ఎవరైనా శిక్ష పడేలా చూస్తే తప్ప వారికి అండగా నిలిచామనడం సరికాదన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios