ఇంట్లో నాటు తుపాకులు తయారు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడో గ్రామ వాలంటీర్. చిత్తూరు జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.  యూట్యూబ్‌లో చూసి అతను తుపాకులను తయారు చేస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. 

చిత్తూరు జిల్లాలో (chittoor district) నాటు తుపాకులు (country made guns) కలకలం రేపాయి. నాటు తుపాకుల్ని తయారు చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు గ్రామ వాలంటీర్ (village volunteer) రవి. చింతతోపు ఎస్టీ కాలనీలో రవి వాలంటీర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. నిందితుడి నివాసంలో నాటు తుపాకుల తయారీకి ఉపయోగించే పరికరాలు, రెండు నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఇతను యూట్యూబ్‌లో చూసి నాటు తుపాకులను తయారు చేసినట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.