Asianet News TeluguAsianet News Telugu

కృష్ణా జిల్లాలో దారుణం... మహిళా వాలంటీర్ పై సచివాలయ ఉద్యోగి వేధింపులు

మహిళా వాాలంటీర్ పై వేధింపులకు పాల్పడుతున్న సచివాలయ ఉద్యోగిపై వీరులపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. 

village secretariat employee harassed woman volunteer akp
Author
Nandigama, First Published Jul 21, 2021, 10:47 AM IST

అమరావతి: మహిళా వాలంటీర్ పై వేధింపులకు పాల్పడుతున్న సచివాలయ ఉద్యోగిపై పోలీస్ కేసు నమోదయ్యింది. బాధిత వాలంటీర్ పిర్యాదుతో సచివాలయ ఉద్యోగిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.  

వివరాల్లోకి వెళితే... కృష్ణా జిల్లా వీరులపాడు మండలం అల్లూరు గ్రామంలో ఓ మహిళా వాలంటీర్ గా పనిచేస్తోంది. అదే గ్రామంలోని సచివాలయంలో పనిచేసే వెల్ఫేర్ అసిస్టెంట్ ఆమెపై గతకొంత కాలంగా వేధింపులకు పాల్పడుతున్నాడు. అతడి వేధింపులపై పలుమార్లు వీరులపాడు ఎండివో కు మొరపెట్టుకున్నప్పటికీ చర్యలు తీసుకోవడం అటుంచి కనీసం పిలిచి మందలించలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది.

read more  వీడు మనిషేనా: మహిళతో వివాహం, ఆమె కూతురిపై ఆరు నెలలుగా రేప్

ఇక అతడి వేధింపులు ఇటీవల మరీ ఎక్కువ కావడంతో బాధిత వాలంటీర్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదుతో బెదిరింపులకు పాల్పడిన సదరు సచివాలయ ఉద్యోగిపై వీరులపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios