స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి 23 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. శనివారం ఉదయం విశాఖ GVMC గాందీ విగ్రహం నుండి పాదయాత్ర ప్రారంభమయ్యింది.   

"

విజయసాయి రెడ్డి ఉక్కు పోరాట యాత్రకు పెద్ద యెత్తున వైసిపి శ్రేణులు చేరుకుంటున్నాయి. విజయసాయి రెడ్డి ఉక్కు పోరాట యాత్రలో మంత్రులు అవంతి శ్రీనివాస్, ధర్మాన కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. జీవీఎంసీ నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఉక్కు ఫ్యాక్టరీ గేటు వరకు సాగుతుంది. 

సాయంత్రం 6గంటలకు స్టీల్ ప్లాంట్ గేట్ ముందు బహిరంగ సభ జరుగుతుంది. పాదయాత్ర కోసం విజయసాయిరెడ్డి  ప్రత్యేక సాంగ్ విడుదల చేశారు. పాదయాత్రలో పెద్ద ఎత్తున జనాలు పాల్గొంటున్నారు.