మిసెస్ ఇండియా తెలంగాణగా విజయవాడకు చెందిన మహిళ విజయం సాధించింది. పెళ్లైన మహిళలకు ఈ పోటీ  నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న భావన విజయవాడకు చెందిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు


మిసెస్ ఇండియా తెలంగాణగా విజయవాడకు చెందిన మహిళ విజయం సాధించింది. పెళ్లైన మహిళలకు ఈ పోటీ నిర్వహించారు. ఈ పోటీల్లో పాల్గొన్న భావన విజయవాడకు చెందిన తొలి మహిళగా రికార్డు సృష్టించారు. తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన 111 మంది మహిళలలో భావన మూడవ రన్నర్‌గా నిలిచి కిరీటాన్ని కైవసం చేసుకున్నారు. 

మిస్సెస్‌ ఇండియా పోటీలకు అర్హత సాధించారు. భావన కూచిపూడి నాట్యంలో పట్టభద్రురాలు. గౌరవ డాక్టరేట్‌తో పాటు 22 రాష్ట్ర, నేషనల్‌ అవార్డులు పొందారు. బాహుబలి చిత్రానికి కొరియోగ్రఫీ చేశారు. ఆమె పదేళ్లు టీవీ రిపోర్టర్‌గా పని చేశారు.