భోపాల్: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం చోటు చేసుకొంది. విధులు నిర్వహించుకొని ఇంటికి వస్తున్న మహిళా టీచర్ పై నలుగురు దుండగులు కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. బాధితురాలు స్పృహ తప్పి పోవడంతో ఆమెను వదిలివెళ్లారు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగు చూసింది.

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సిధిలో సాయంత్రం స్కూల్‌ ముగించుకొని తిరిగి వస్తున్న టీచర్‌పై నలుగురు స్థానికులు దగ్గర్లోని ఓ ఫాంహౌజ్‌కు ఎత్తుకెళ్లి గ్యాంగ్‌రేప్‌ చేశారు. ఆమె స్పృహతప్పి పడిపోవడంతో అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనలో పాల్గొన్న నలుగురు నిందితుల్లో ఒకరు సుమారు ఆరేడు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడు. 

ఈ నలుగురిలో ఒకరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.బాధితురాలు ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తోంది. ఈ  ఘటన ఆ కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టుగా జిల్లా ఎస్పీ తెలిపారు.ఇక ఇదే రాష్ట్రంలో మరో ఘటన కూడ చోటు చేసుకొంది. దమోహ్ జిల్లాలో 12వ తరగతి చదివే విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడింది.

బాధితురాలు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకొంది. ప్రతి రోజూ కాలేజీకి వెళ్లే సమయంలో బాధితురాలిని కొందరు యువకులు వేధించేవారు. ఈ వేధింపులు భరించలేక బాధిత యువతి ఆత్మహత్యకు పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ విషయమై బాధితురాలి కుటుంబం తమకు ముందుగానే ఫిర్యాదు చేస్తే బాధితురాలిని కాపాడేందుకు చర్యలు తీసుకొనేవారమని పోలీసులు తెలిపారు. 

యూపీ రాష్ట్రంలోని ఉన్నావ్ బాధితురాలిపై హత్యచేయడం, హైద్రాబాద్ లో దిశపై గ్యాంగ్ రేప్ చేసి హత్య చేసిస ఘటనలు మరువకముందే ఈ రెండు ఘటనలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొన్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.