విజయవాడ: పాకిస్తాన్‌లోని హవాలా వ్యాపారులతో సంబంధాలు ఉన్న ఏడుగురు నేవీ సిబ్బందిని  ఏపీకి చెందిన ఇంటలిజెన్స్ అధికారులు శుక్రవారం నాడు అరెస్ట్ చేశారు. వీరిని విజయవాడ కోర్టులో హాజరుపర్చారు.

పాకిస్తాన్‌కు చెందిన హావాలా వ్యాపారులతో విజయవాడలో ఏడుగురు నేవీ అధికారులు, సిబ్బందిని ఏపీ ఇంటలిజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. కేంద్ర నిఘా వర్గాల సమాచారం మేరకు ఏపీ ఇంటలిజెన్స్ అధికారులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు.

హావాలా మార్గంలో డబ్బులను మార్పిడి కోసమే ఈ సంబంధాలను కొనసాగించారా లేక ఇతర విషయాలపై కేంద్రీకరించారా అనే కోణంలో కూడ అధికారులు విచారణ చేపట్టారు.

పాకిస్తాన్‌లో ఎవరెవరితో నేవీ అధికారులు ఏ విషయాలపై మాట్లాడారు.  హావాలా వరకే  వీరి సంబంధాలు చోటు చేసుకొన్నాయా లేక ఇతర విషయాలపై కూడ వీరి మధ్య సమాచారమార్పిడి చోటు చేసుకొందా అనే కోణంలో కూడ నిఘా వర్గాలు సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఏడుగురిని విజయవాడ కోర్టులో  హాజరుపర్చారు. నిందితులకు 14 రోజుల పాటు జ్యూడీషీయల్ రిమాండ్‌కు తరలించాలని కోర్టు ఆదేశించింది.