విజయవాడ నగరంలో భారీ దొంగతనాలకు పాల్పడుతున్న కరుడుగట్టిన ఓ దొంగల ముఠా పోలీసులకు చిక్కింది. నగరంలో ఉన్నతర్గాలకు చెందిన  ఇళ్లను టార్గెట్ చేసుకుని వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ముఠా నుండి భారీ మొతాదులో బంగారం, వెండితో డబ్బులను పోలీసులు స్వాదీనం చేసుకున్నారు. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను పోలీస్ కమీషనర్ ద్వారకా తిరుమలరావు మీడియాకు వివరించారు. 

 బెజవాడలో గత కొన్ని రోజులుగా వరుస దొంగతనాలకు సంబంధించి తమ వద్ద అనేక కేసులు నమోదయ్యాయని సిపి తెలిపారు. అయితే ఈ దోపిడీకి పాల్పడుతున్న దొంగల ముఠా అత్యంత చాకచక్యంగా వ్యవహరిస్తూ ఎలాంటి క్లూస్ దొరకకుండా జాగ్రత్తపడేవాని తెలిపారు. ధనవంతుల ఇళ్లను మాత్రమే టార్గెట్ గా ఎెంచుకున్న వీరు భారీ  ఎత్తున బంగారం, వెండి వస్తువులతో పాటు నగదెను కూడా తస్కరించేవారని  తెలిపారు. 

దీంతో ఈ దొంగల ముఠా ఆగడాలను అరికట్టడానికి కమీషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లను అలెర్ట్ చేశామన్నారు. మరీముఖ్యంగా రాత్రి సమయాల్లో గస్తీని మరింత పెంచినట్లు తెలిపారు. ఇలా ఓ సవాల్ గా తీసుకుని పనిచేస్తూ చివరకు ఈ  దొంగతనాలకు కారణమైన ముఠాను పట్టుకున్నట్లు సిపి వెల్లడించారు. 

గతంలో అనేక నేరాలకు పాల్పడిన కరుడుగట్టిన నేరస్థుడు  భూక్యా నాయక్ ఈ దొంగల ముఠాకు నాయకుడిగా వ్యవహరించినట్లు పేర్కొన్నారు. అతడి  సారథ్యంలో మరికొంత మంది తాళం వేసిన ఇళ్లను టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడేవారన్నారు. ఇలా వందల సంఖ్యలో ఇళ్లను లూటీ చేసి కిలోక కొద్ది బంగారం, వెండి ఆభరణాలతో పాటు భారీగా నగదును దోచుకున్నట్లు...వాటిలో కొన్నింటిని తాము ప్రస్తుతం స్వాధీనం  చేసుుకున్నట్లు సిపి తెలిపారు. మిగతా  దోపిడీ సొత్తును కూడా అతి  త్వరలో రికవరీ చేస్తామని ఆయన మీడియాకు తెలియజేశారు.