పురుగులు పట్టిన మాంసం విక్రయం: విజయవాడలో ఓబేశ్వరరావు అరెస్ట్
కుళ్లిన మాంసాన్ని విక్రయిస్తున్న ఓబేశ్వరరావును విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓబేశ్వరరావు విజయవాడలోని ఐదు మటన్ దుకాణాల్లో ఈ మాంసం విక్రయిస్తున్నట్టుగా పోలీసులు తెలిపారు. నిందితుడి నుండి 100 కిలోల మటన్ ను స్వాధీనం చేసుకొన్నారు.ఈ మటన్ ను గోతిలో పూడ్చి పెట్టారు.
విజయవాడ: కుళ్లిన మాంసం విక్రయిస్తున్న వ్యాపారి Obeshhwarraoను పోలీసులు అరెస్ట్ చేశారు. అధికారులు నిర్వహించిన తనిఖీల్లో పురుగులు పట్టిన మాంసాన్ని విక్రయిస్తున్నట్టుగా తేలడంతో ఓబేశ్వరరావును పోలీసులు అరెస్ట్ చేశారు.
Vijayawada లోని రాణిగారితోట, భూపేష్‌గుప్తానగర్ లలో గల meat దుకాణాలతో పాటు ఓబేశ్వరరావు నివాసంలో కూడా అధికారులు తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో పురుగుల పట్టిన మాంసాన్ని అధికారులు గుర్తించారు. పెట్టెల్లో పెట్టి గోనెసంచిలో ఈ మాంసాన్ని నిల్వ చేసినట్టుగా గుర్తించారు. సుమారు 100 కేజీల మాంసం పెట్టెలను అధికారులు సీజ్ చేశారు. ఈ మాంసంపై బ్లీచింగ్ పౌడర్ చల్లి అధికారులు గోతిలో పూడ్చి పెట్టారు.
Guntur జల్లా వినుకొండలోని సంతలో చనిపోయిన మేకలను రూ. 1550, రూ.2000లకు కొనుగోలు చేస్తున్నారని అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. ఈ మాంసాన్ని నిల్వ ఉంచి విక్రయిస్తున్నారు. ఈ విషయమై కచ్చితమైన సమాచారం మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో పురుగులు పట్టిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు. మాంసం విక్రేతలు నాణ్యమైన మాంసాన్ని విక్రయించాలని అధికారులు సూచించారు. నాసిరకం Mutton విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకొంటామని అధికారులు హెచ్చరించారు.
అనారోగ్యానికి గురైన మేకలు,గొర్రెలను కబేళాలకు తరలిస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న మేకలు, గొర్రెలకు చెందిన మాంసాన్నే విక్రయించాలి. అయితే ఈ విషయమై పశుసంవర్ధక శాఖకు చెందిన వైద్య నిపుణులు ప్రతి రోజూ మేకలు,గొర్రెలు, పొట్టేల ఆరోగ్యాన్ని పరీక్షించిన తర్వాతే మాంసం కొరకు కోయడానికి అనుమతించాలి. కానీ నిబంధనలను మాంసం వ్యాపారులు పాటించడం లేదని ఓబేశ్వరరావు ఉదంతం బయట పెట్టింది. మాంసం వ్యాపారులు ప్రజల ఆరోగ్యాలను పట్టించుకోకుండా తమకు లాభం వచ్చిందా లేదా అనే విషయం కోసమే వ్యాపారులు పనిచేస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో గతంలో కూడా పలు హాటల్స్ కూడా నాసిరకం మాంసంతో బిర్యానీలు తయారు చేసిన విషయమై అధికారులు కేసులు నమోదు చేశారు. నాసిరకం మటన్ ను ఫ్రిజ్ ల్లో ఉంచి విక్రయిస్తున్నట్టుగా అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే.