Asianet News Telugu

బెజవాడ పోలీసుల అదుపులో బంగ్లాదేశీయులు: భారత్‌లోకి అక్రమంగా ప్రవేశం.. నకిలీ పత్రాలతో నివాసం

నలుగురు బంగ్లాదేశ్ యువకులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. తుల్లానా జిల్లా నుండి భారత్‌లోకి వీరు ప్రవేశించినట్లుగా తెలుస్తోంది. హౌరా - వాస్కోడిగామా రైలులో వెళ్తుండగా విజయవాడలో రైల్వే పోలీసులు వీరిని పట్టుకున్నారు.

vijayawada police arrested four bangladesh men who illegal migrant ksp
Author
Vijayawada, First Published Jul 3, 2021, 7:42 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

నలుగురు బంగ్లాదేశ్ యువకులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. తుల్లానా జిల్లా నుండి భారత్‌లోకి వీరు ప్రవేశించినట్లుగా తెలుస్తోంది. హౌరా - వాస్కోడిగామా రైలులో వెళ్తుండగా విజయవాడలో రైల్వే పోలీసులు వీరిని పట్టుకున్నారు. పాస్ పోర్ట్ లేకుండా నల్లాల ద్వారా భారత్ లోకి ప్రవేశించినట్టు గుర్తించారు. దర్బంగా పేలుడు ఘటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏపీలోకి రావడానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

ఉపాధి కోసం భారత్‌లోకి అక్రమంగా వచ్చినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వీరితోపాటు మరికొందరు బంగ్లాదేశీయులు భారత్ లోకి ప్రవేశించినట్లుగా నిర్దారించారు. అంతేకాకుండా పలు రాష్ట్రాల్లో అక్రమంగా చొరబడి నివాసాలు ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి నకిలీ పాన్, ఆధార్ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వీరిని త్వరలోనే కోర్ట్‌లో ప్రవేశపెట్టనున్నారు పోలీసులు. 

Follow Us:
Download App:
  • android
  • ios