చెడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యులు అరెస్ట్: గుజరాత్ నుండి విజయవాడకు తరలింపు
విజయవాడ, గుంటూరులలో చోరీలకు పాల్పడిన చెడ్డీ గ్యాంగ్ ముఠా సభ్యులను విజయవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. గుజరాత్ రాష్ట్రం నుండి నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకొచ్చారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో దోపీడీకి పాల్పడిన Cheddi Gang ముఠాను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారుత. Gujarat రాష్ట్రం నుండి పోలీసులు నిందితులను ఏపీ రాష్ట్రానికి తీసుకొచ్చారు. చెడ్డీ గ్యాంగ్ ముఠాలో సభ్యులు గుజరాత్ రాష్ట్రంలోని దాహద్ జిల్లా గుల్బర్గా వాసులని పోలీసులు తెలిపారు. రెండు ముఠాలు గా విడిపోయి వేర్వేరు ప్రాంతాల్లో చోరీకి పాల్పడినట్టుగా పోలీసులు తెలిపారు. పోరంకి, తాడేపల్లిలో ఒక ముఠా, చిట్టినగర్, గుంటుపల్లిలో మరో ముఠా దోపీడికి పాల్పడిందని పోలీసులు తెలిపారు.
also read:చెడ్డీగ్యాంగ్ కేసులో పురోగతి.. పోలీసుల అదుపులో నలుగురు నిందితులు...
Vijayawada, గుంటూరు జిల్లాల్లో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేసిన దృశ్యాలు cctv ల్లో రికార్డయ్యాయి. చెడ్డీ గ్యాంగ్ ముఠా ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. సీసీటీవీ పుటేజీ ఆధారంగా నిందితులు గుజరాత్ రాష్ట్రానికి చెందినవారుగా గుర్తించారు. స్థానిక పోలీసుల సహకారంతో అనుమానితులుగా ఉన్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని పోలీసులు విచారిస్తున్నారు. త్వరలోనే మరికొంతమందిని అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. తమకు దొరికిన వారిని విచారించి మిగతావారిని అదుపులోకి తీసుకుంటామని తెలిపారు పోలీసులు. కాగా గుజరాత్ లో రెండు బృందాలుగా విడిపోయిన పోలీసులు చెడ్డీ గ్యాంగ్ కోసం ముమ్మరంగా గాలించారు.
దోపీడీకి సహకరించిన మరో వ్యక్తి అరెస్ట్: విజయవాడ సీపీ
చెడ్డీ గ్యాంగ్ అరెస్ట్ కు సంబంధించి విజయవాడ సీపీ కాంతిరాణా శుక్రవారం నాడు సాయంత్రం విజయాడలో మీడియాకు వివరించారు. ఊరి చివర్లో ఉన్న ఇళ్లతో పాటు ఇళ్ళలో ఎవరి లేరని నిర్ధారించుకొన్న ఇళ్లలో మాత్రమే చెడ్డీ గ్యాంగ్ దోపీడీలకు పాల్పడుతుందని ఆయన చెప్పారు. ఈ గ్యాంగ్ కు చెందిన ముగ్గురితో పాటు దోపీడీకి సహకరించిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశామన్నారు. చెడ్డీ గ్యాంగ్ సభ్యులు రెండు ముఠాలుగా విడిపోయి చోరీలకు పాల్పడ్డారన్నారు. ఈ ముఠాలోని సభ్యుల్లో ఇతరుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ గ్యాంగ్ లోని పలువురు సభ్యులపై పలు రాష్ట్రాల్లో కేసులున్నాయని సీపీ తెలిపారు.మిగిలిన సభ్యులు మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సంచరిస్తున్నారని సీపీ తెలిపారు. నిందితుల కోసం విజయవాడ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్టుగా ఆయన తెలిపారు. చోరీకి పాల్పడిన తర్వాత నిందితులు రైళ్లలో స్వస్థలాలకు వెళ్లిపోతారని సీపీ చెప్పారు.త ఈ ముఠా సభ్యులపై పలు కేసులున్నాయని ఆయన తెలిపారు. గత పది రోజుల వ్యవధిలో నగరంలో మూడు చోట్ల ఈ చెడ్డీ గ్యాంగ్ చోరీలకు పాల్పడ్డారని, ఈ ఘటనలో సుమారు 10 లక్షల రూపాయలు విలువ చేసే వెండి వస్తువులు, బంగారు ఆభరణాలు దోచుకుపోయారని, అయితే ఆయా ఘటనలో ఎవరి పైనా దాడి చేయలేదని అన్నారు.