అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్షాల మధ్య పొత్తులు ఏర్పడే అవకాశాలు ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.ఈ మేరకు ఆయా పార్టీల నేతలు సంకేతాలు ఇచ్చారు. 

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విపక్షాలు కలిసి పోటీ చేయాలనే అభిప్రాయంతో ఉన్నట్టుుగా కన్పిస్తున్నాయి.  టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీల మధ్య పొత్తుల అవకాశాలు ఉన్నాయి.

Also read:మున్సిపల్ ఎన్నికలు: చంద్రబాబుతో పొత్తుకు పవన్ కల్యాణ్ రెడీ?

అమరావతిని రాజధాని కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఏర్పాటైన జాయింట్ యాక్షన్ కమిటిలో టీడీపీ, లెఫ్ట్ పార్టీలు ఇప్పటికే కలిసి పని చేస్తున్నాయి. జనసేన కూడా ఈ ఆందోళనలకు మద్దతునిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపితో పొత్తు పెట్టుకోవాలని జనసేన భావిస్తోంది.

పార్టీ నేతలతో చర్చల సమయంలో స్థానిక సంస్థల ఎన్నికల విషయమై పవన్ కళ్యాణ్ చర్చించినట్టుగా సమాచారం. ఈ విషయమై టీడీపీతో పొత్తు విషయమై కూడ చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ విషయమై జనసేన నేతలు కూడ సానుకూలంగా స్పందించినట్టుగా సమాచారం.

మరోవైపు అమరావతిలో రాజధాని కొనసాగించాలని బీజేపీ కోర్ కమిటీ శనివారం నాడు తీర్మానం చేయడం కూడా రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకొంది. రాజధాని విషయంలో లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ తీసుకున్న నిర్ణయం విపక్షాలకు కలిసి వచ్చేదిగా కనిపిస్తుంది.

జగన్ నిర్ణ యంపై విపక్షాలు ఆందోళనలు చేస్తున్నాయి.  బీజేపీ స్వంతంగా పోరాటం చేయాలని భావిస్తోంది. లెఫ్ట్, టీడీపీలు జేఎసీలో భాగస్వామ్యంగా ఏర్పడి పోరాటం చేస్తున్నాయి. జనసేన, బీజేపీలు వేర్వేరుగా ఉద్యమిస్తున్నాయి.  ఈ పరిణామం అధికార వైసీపీపై వ్యతిరేకత పెరుగుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అభిప్రాయపడ్డారు. 

2019 ఏప్రిల్ మాసం లో జరిగిన జనరల్ ఎన్నికల్లో టిడిపికి 40 శాతం, జనసేన కు 6 శాతం, లెఫ్ట్ పార్టీలకు ఒక శాతం ఓట్లు లభించాయి. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే రాజకీయంగా అధికార పార్టీని దెబ్బతీసే అవకాశం ఉంటుందని సీపీఐ నాయకత్వం అభిప్రాయంతో ఉంది.

 గత జనరల్ ఎన్నికల్లో వైసీపీకి 50 శాతం ఓట్లు వచ్చాయి. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం ఓట్లు ఆ పార్టీ దక్కించుకోలేదని సీపీఐ నేత రామకృష్ణ అభిప్రాయపడ్డారు. లెఫ్ట్, జనసేన పార్టీలతో ఎన్నికల్లో పొత్తుల అంశాన్ని పరిశీలిస్తున్నట్లు టీడీపీ నేతలు కూడా చెప్తున్నారు.సంక్రాంతి తర్వాత పొత్తుల విషయంలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని టిడిపి నేతలు చెబుతున్నారు.

అంతేకాదు విపక్షాలు ఐక్యంగా ఉండి అధికారపక్షం ఎదుర్కొనేందుకు ప్రయత్నం చేయనున్నట్టు టిడిపి నేత ఒకరు చెప్పారు. గత జనరల్ ఎన్నికల ముందు బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత బీజేపీతో తమకు  రాజకీయంగా ఇబ్బందులు లేవనే సంకేతాలను టీడీపీ ఇస్తోంది. ఈ పరిణామాలు కూడ వచ్చే ఎన్నికల్లో కొత్త రాజకీయ సమీకరణాలకు నాంది పలికే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.