సీఏ(ఛార్టెర్డ్ అకౌంటెన్సీ) కోర్సు ఎగ్జామ్ రిజల్ట్స్ గురువారం విడుదలయ్యాయి. ఈ పరీక్షల్లో విజయవాడ కుర్రాడు తన ప్రతిభ కనపరిచాడు. పాత విధానంలో జరిగిన పరీక్షలో విజయవాడ నుంచి హాజరైన గుర్రం నాగ శ్రీకృష్ణ ప్రణీత్ దేశంలోనే ప్రథమ ర్యాంకర్ గా నిలిచాడు.

కొత్త విధానంలో జరిగిన పరీక్షకు మొత్తం 15,003 మంది హాజరుకాగా... అందులో 15.2శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. కోల్ కతాకు చెందిన అభయ్ బజోరియా మొదటి ర్యాంకు, కోల్ కతాకు చెందిన ధ్రువ్ కొఠారి, నోయిడాకు చెందిన సూర్యాంశ్ అగర్వాల్  రెండో ర్యాంకు, అహ్మదాబాద్ కు చెందిన దర్శన్ షా మూడో ర్యాంకు సాధించారు.

Also Read విశాఖలో నేవీ ఉద్యోగి అమిత్‌కుమార్ ఆత్మహత్యాయత్నం...

పాత విధానంలో  జరిగిన పరీక్షకు 8,021 మంది హాజరుకాగా... వారిలో 10.20శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో కేరళలోని మనక్కాడ్ కు చెందిన వరద కేపీ రెండో స్థానంలో, ముంబయికి చెందిన ధావన్ చోప్డా మూడో స్థానంలో నిలిచారు