విజయవాడ మాజీ ఎంపీ మృతి..చంద్రబాబు దిగ్భ్రాంతి

https://static.asianetnews.com/images/authors/26af83d2-0ed6-5e66-b49b-5078caf01292.jpg
First Published 18, Aug 2018, 10:25 AM IST
VIJAYAWADA EX MP VIDHYA DEAD
Highlights

విజయవాడ మాజీ  ఎంపీ చెన్నుపాటి విద్య మృతి చెందారు. ఈరోజు తెల్లవారు జామున 4గంటలకు ఆమె నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు.  చెన్నుపాటి విద్య ప్రముఖ హేతువాది గోపరాజు రామచంద్రరావు(గోరా) కుమార్తె.

విజయవాడ: విజయవాడ మాజీ  ఎంపీ చెన్నుపాటి విద్య మృతి చెందారు. ఈరోజు తెల్లవారు జామున 4గంటలకు ఆమె నివాసంలో గుండెపోటుతో మృతిచెందారు.  చెన్నుపాటి విద్య ప్రముఖ హేతువాది గోపరాజు రామచంద్రరావు(గోరా) కుమార్తె. కాంగ్రెస్ పార్టీ తరపున రెండు సార్లు విజయవాడ ఎంపీగా పనిచేసిన ఆమె జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎదురులేని మహిళా నాయకురాలిగా విద్యకు గుర్తింపు ఉంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో అంతటి స్థాయి గుర్తింపు పొందిన మహిళా నేత చెన్నుపాటి విద్యనే అని ఇప్పటికీ నేతలు చెప్పుకుంటూ ఉంటారు. 


విద్య మృతిపట్లు ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చెన్నుపాటి విద్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. రెండుసార్లు లోక్‌సభ సభ్యురాలిగా ఆమె చేసిన సేవలు ప్రశంసనీయమని, మహిళాభ్యుదయం కోసం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. చెన్నుపాటి విద్య మృతి విజయవాడకే కాదు రాష్ట్రానికే తీరని లోటన్నారు. 

loader