విజయవాడలో కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో నగరంలోని 62 వార్డులు ఉండగా అందులో 42 వార్డులను కంటైన్మెంట్ జోన్లుగా గుర్తించామన్నారు. ఇందుకు సంబంధించి కృష్ణ జిల్లా కలెక్టర్ నిన్న రాత్రి ఆదేశాలను జారీ చేసారు. ఆ జోన్లలో లాక్ డౌన్ ఆంక్షలు యధావిధిగా అమలవుతాయని తెలిపారు. 

ఇకపోతే నేటి నుండి దుర్గ గుడి భక్తుల దర్శనార్థం తెరుచుకుంది. నగరంలో 42 జోన్లు కంటైన్మెంట్ జోన్లు ఉండడం, ఇంద్రకీలాద్రికి చేరుకొని ఉన్న రెండు దారులు కూడా కంటైన్మెంట్ జోన్లను ఆనుకొని ఉన్నవే. కుమ్మరిపాలెం కానీ, కనకదుర్గ నగర్ కానీ రెండు దార్లు కూడా కంటైన్మెంట్ జోన్లను ఆనుకొని ఉన్నవే. గుడికి రెండు వందల మీటర్ల దూరంలోనే కంటైన్మెంట్ జోన్లు ఉన్నాయి. 

మరి గుడిని తెరవడానికి అనుమతులను ఎలా ఇచ్చారు అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ... గుడి దాదాపుగా 800 మీటర్ల ఎత్తులో ఉన్నందున అది కంటైన్మెంట్ జోన్ కిందకు రాదూ అని అధికారులు సెలవిచ్చారట. 

గుడికి చేరుకోవాలన్న కూడా అందరూ ఎవరైనా కంటైన్మెంట్ జోన్ ప్రాంతం నుండి వెళ్లవలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా విజృంభిస్తున్న తరుణంలో  భక్తులు ఎలా అక్కడకు చేరుకుంటారు అన్నది వేచి చూడాల్సిన అంశం. 

ఎత్తులో ఉంది కాబట్టి అది కంటైన్మెంట్ జోన్ కిందకు రాదూ అని అధికారులు చెబుతున్నారు. కిందంతా కంటైన్మెంట్ జోన్లు ఉంటే... పైకి కొండమీదకు వచ్చే భక్తులు ఎలా పైకి కంటైన్మెంట్లు జోన్లు దాటకుండా వస్తారు అనేది ఇక్కడి ప్రశ్న.