విజయవాడ గవర్నర్‌పేట్‌లోని రామయ్య మెస్‌లో భోజనంలో బల్లి రావడం కలకలం రేపుతోంది. ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితుడు మురళి వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. 

విజయవాడ గవర్నర్‌పేట్‌లోని రామయ్య మెస్‌లో భోజనంలో బల్లి రావడం కలకలం రేపుతోంది. మంగళవారం మురళీ అనే వ్యక్తి రామయ్య మెస్‌లో భోజనం చేస్తుండగా.. సాంబార్‌లో బల్లి వుండటాన్ని గుర్తించాడు. వెంటనే ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించలేదని హోటల్‌కు వచ్చిన వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రాణాలతో చెలగాటం ఆడేలా హోటల్ నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని మండిపడ్డారు. ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితుడు మురళి వినియోగదారుల కోర్టును ఆశ్రయించాడు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.