విజయవాడ కోర్టు సంచలన తీర్పు

విజయవాడ:నాగ వైష్ణవి కేసులో ముగ్గురు నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.నాగవైష్ణవి కేసులో  విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు గురువారం నాడు సంచలన తీర్పు వెలువరించింది.


2010 జనవరి 30వ తేదిన  నాగవైష్ణవిని  బంధువులు హత్య చేశారు. అనంతరం బాయిలర్ మృతదేహన్ని దహనం చేశారు. స్కూల్ కు వెళ్తున్న  నాగవైష్ణవి కారులో స్కూల్ కు వెళ్తుండగా కిడ్నాప్ చేసి హత్య చేశారు.  ఈ కేసులో ఏ 1 నిందితుడుగా  మోర్ల శ్రీనివాస్  ఏ 2 జగదీష్,  ఏ3 వెంకట్రావ్  ఉన్నారు. ఈ కేసులో నిందితులు ఇప్పటికే జైలులోనే శిక్షను అనుభవిస్తున్నారు. 

ఈ కేసు తుది తీర్పు సందర్భంగా జైలు నుండి  ముగ్గురు నిందితులను  భారీ భద్రత నడుమ కోర్టుకు తీసుకొచ్చారు.  కూతురు మరణించిన విషయం తెలిసిన వెంటనే నాగవైష్ణవి తండ్రి ప్రభాకర్ గౌడ్  గుండెపోటుతో మరణించారు.  భర్త, కూతురు మరణించిన తర్వాత ప్రభాకర్ గౌడ్  సతీమణి  కూడ  మరణించారు. 


2010లో  ఈ ఘటన అప్పట్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రలో సంచలనం సృష్టించింది.సాక్ష్యలు దొరకకుండా నాగవైష్ణవిని  బాయలర్‌లో వేసి దహనం చేశారు. చనిపోయే వరకు జీవిత ఖైదును విధించాలని కోర్టు తన తుది తీర్పులో వెల్లడించింది. ఎనిమిదేళ్ళ తర్వాత ఈ కేసుకు సంబంధించిన తీర్పు వెల్లడైంది.  బాధిత కుటుంబానికి ఎట్టకేలకు న్యాయం జరిగిందని నాగవైష్ణవి బంధువులు అభిప్రాపడుతున్నారు.