Asianet News TeluguAsianet News Telugu

విజయవాడ బస్సు కాలిపోయింది, ప్రయాణికులు సేఫ్ (వీడియో)

  • విజయవాడ గవర్నర్ పేటలో మంటల్లో బస్సు,
  • 70 మంది ప్రాణాలు కాపాడి న బస్ డ్రైవర్ ఎ .వెంకటేశ్వరరావు, కండక్టర్ శిరీష
vijayawada bus driver and conductor avert a major human tragedy

 

 

విజయవాడ గవర్నర్ పేట 2 డిపోకి చెందిన చూస్తుండగానే మంటలకు ఆహుతయింది. అయితే, 70  మంది ప్రయాణికులు మాత్రం సురక్షితం. బస్సుడ్రయివర్ వెంకటేశ్వరరావు, కండక్టర్ శిరీష అప్రమత్తంగా ఉండి, వారిని కాపాడారు. లేకపోతే, ఘోరమయిన ప్రమాదం జరిగేది.  

ఇలా జరిగిందిదంతా

vijayawada bus driver and conductor avert a major human tragedy

 

AP9Z 6409 నెంబర్  బస్ రూటు నెంబర్ 54 లో   ఉదయం మొదటి ట్రిప్ గా వెళ్లేందుకు బయలుదేరేంది. బస్సు  రైల్వే స్టేషన్ నుండి అటోనగర్ దాకా బాగానే వచ్చింది. అయితే, తిరిగి అటోనగర్ నుండి రైల్వేస్టేషన్ కి వెళ్తున్న సమయంలో,  కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ కి వచ్చే సరికి బస్సు నుండి చిన్న శబ్దం రావటంతో డ్రయివర్ వెంకటేశర్వరావుకు, కండక్టర్ శిరీషను అనుమానం వచ్చింది. చూస్తూ  ఏదో పెద్ద ముప్పు వాటిల్ల బోతున్నదని డ్రయివర్ పసిగట్టాడు. కండక్టర్ శీర్షిక డ్రైవర్ ని అప్రమత్తం చేశాడు. పొగలు రావడం మొదలయింది. వెంటనే బస్సు ను పక్కకి తీసి పార్క్ చేశాడు. అంతే,మంటలు వ్యాపించాయి. బస్సు లో ఉన్న 70మంది ప్రయాణికులను సురక్షితంగా బస్సు నుండి  వారిద్దరు దించగలిగారు. తరువాత ఒక్క సారి గా బస్సు ఎడమ భాగం నుండి మంటలు వ్యాపించాయి.  వెంటనే అగ్నిమాపక కేంద్రనికి సమాచారం అందించారు. అయితే బస్సు మొత్తం కాలిపోయింది. అగ్ని మాపక సిబ్బంది మంటలు అదుపుచేశారు.  ఇంత పెద్ద ప్రమాదం లో డ్రైవర్ అప్రమత్తతతో  పెద్ద నష్టం తప్పటంతో అధికార యంత్రంగా ఊపిరి పిల్చుకుంది. బస్సు ప్రమాదం ఎలా జరిగింది గ్యాస్ లీక్ అవ్వటానికి కారణాల ను అర్ టి సి ఉన్నత అధికారులుఅన్వేషిస్తున్నారు .

Follow Us:
Download App:
  • android
  • ios