దత్తపీఠంలో వైఎస్ జగన్.. అమ్మవారిని దర్శించుకుని, గణపతి సచ్చిదానంద స్వామితో భేటీ..

సీఎం జగన్ తో సమావేశమైన అనంతరం గణపతి సచ్చిదానంద స్వామి మీడియాతో మాట్లాడుతూ..  ఏపీలో దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో సంతోషంగా ఉన్నారు.  Preservation of Hindu Dharmaకు  సీఎం జగన్ కట్టుబడి ఉన్నారు. 

Vijayawada : AP CM YS Jagan Offers Prayers At Marakata Rajarajeswari Devi Temple

విజయవాడ : ముఖ్యమంత్రి YS Jaganmohan Reddy విజయవాడ పటమట దత్త నగర్ లోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ఆశ్రమం కి చేరుకున్నారు.  ఆశ్రమంలో తొలుత మరకత రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం Sachchidananda Swami తో సమావేశం స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు.

Vijayawada : AP CM YS Jagan Offers Prayers At Marakata Rajarajeswari Devi Temple

సీఎం జగన్ తో సమావేశమైన అనంతరం గణపతి సచ్చిదానంద స్వామి మీడియాతో మాట్లాడుతూ..  ఏపీలో దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో సంతోషంగా ఉన్నారు.  
Preservation of Hindu Dharmaకు  సీఎం జగన్ కట్టుబడి ఉన్నారు.  ఆలయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరాను. వంశపారంపర్య అర్చకులను కొనసాగించాలని అడిగాను.  అందుకు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు’ అని గణపతి సచ్చిదానంద స్వామి  తెలిపారు.

కాగా Datta Peethamకి ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉంది. 35 దేశాల్లో దత్త పీఠం శాఖలను ప్రారంభించింది శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ హిందూ ప్రచారం నిర్వహిస్తున్నారు.  భారతదేశంలో మరో 89 శాఖలను ప్రారంభించారు.  వీటి ద్వారా ప్రతినిత్యం పేదలకు అన్నదానం ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహణ చేపడుతున్నారు.  మ్యూజిక్ ఫర్ మెడిటేషన్ అండ్ ఫీలింగ్  రాగ సాగర  నాద పేరుతో  కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.  మ్యూజిక్ ద్వారా చికిత్స కోసం అనేక దేశాల్లో సంగీత విభావరులు ఏర్పాటు చేస్తున్నారు.

తిరుమల శ్రీవారి సన్నిధిలో జగన్ కు తులాభారం... మొక్కుతీర్చుకున్న సీఎం (ఫోటోలు)

ఇంద్రకీలాద్రిపై ముఖ్యమంత్రి.. 

ఇదిలా ఉండగా, దసరా నవరాత్రుల సమయంలో ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాల్లో భాగంగా మూలానక్షత్రంలో అక్టోబర్ 12న అమ్మవారికి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిపట్టువస్త్రాల సమర్పించారు. 

సీఎం పర్యటన నేపథ్యంలో ఆలయంలో జరిగిన ఏర్పాట్లను దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్  పరిశీలించారు. ఈ క్రమంలో ఏర్పాట్లన్ని పక్కాగా ఉండాలని అధికారులకు ఆదేశించారు. సీఎంతో పాటు మంత్రులు, ఉన్నతాధికారులకు దేవాదాయ శాఖ తరఫున స్వాగతం పలికారు. చినరాజగోపురం నుంచి సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాల సమర్పణ, అంతరాలయంలో పూజలు, అనంతరం వేదపండితుల ఆశీర్వచనం కార్యక్రమాలను నిర్వహించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఆలయ ఈవో పూర్ణకుంభంతో స్వాగతించారు. 

తిరుమల శ్రీవారి సన్నిధిలో జగన్... 
కలియుగతదైవం తిరుమల వెంకటేశ్వర స్వామిని అక్టోబర్ 12, మంగళవారం ముఖ్యమంత్రి జగన్ దర్శించుకుని మొక్కు చెల్లించుకున్నారు. ఉదయమే శ్రీవారి ఆలయంవద్దకు చేరుకున్న సీఎంకు టీటిడీ ఛైర్మన్‌ వైవి సుబ్బారెడ్డి దంపతులు స్వాగతం పలికారు. నేరుగా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న తర్వాత జగన్ తులాభారం మొక్కు చెల్లించుకున్నారు.   

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం  వైఎస్ జగన్... లడ్డూ ప్రసాదాల తయారీ కోసం నూతన బూందీపోటును ప్రారంభించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios