స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం.. చంద్రబాబు కస్టడీ పిటిషన్‌పై వాదనలు పూర్తి, తీర్పు రేపటికి రిజర్వ్
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కస్టడీ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. రేపు ఉదయం తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కస్టడీ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు పూర్తయ్యాయి. రేపు ఉదయం తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి ప్రకటించారు. సీఐడీ తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, చంద్రబాబు తరపున సుప్రీంకోర్ట్ సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ్ లూథ్రా వాదనలు వినిపించారు. ఐదు రోజుల పాటు చంద్రబాబును కస్టడీకి అప్పగించాలని కోరింది సీఐడీ. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంలో రూ.371 కోట్లు దుర్వినియోగం అయ్యాయని స్పష్టమైన ఆధారాలు వున్నాయని అన్నారు పొన్నవోలు. చంద్రబాబును కస్టడీకి తీసుకుని విచారిస్తేనే అన్ని విషయాలు బయటకు వస్తాయని సుధాకర్ రెడ్డి వాదించారు.
ALso Read: చంద్రబాబు కస్టడీతో ఎవరికీ ఏ నష్టమూ వుండదు..: ఏసిబి కోర్టులో ఏఏజి వాదన సాగిందిలా...
అటు చంద్రబాబు తరపున సిద్ధార్ధ్ లూథ్రా, సిద్ధార్థ్ అగర్వాల్ వాదనలు వినిపించారు. టీడీపీ అధినేతను కోర్టులో హాజరుపరిచిన సెప్టెంబర్ 10న సీఐడీ కస్టడీ కోరలేదని, మరుసటి రోజు మెమో ఎలా దాఖలు చేస్తారని ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 24 గంటల వ్యవధిలోనే దర్యాప్తు అధికారి నిర్ణయం ఎలా మార్చుకుంటారని సిద్ధార్ధ లూథ్రా ప్రశ్నించారు. చంద్రబాబు అరెస్ట్ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, పాత అంశాలతో కస్టడీకి ఎలా కోరుతారని ఆయన వాదించారు. చంద్రబాబును అరెస్ట్ చేసి కొన్ని గంటల పాటు విచారించి.. అన్ని రాబట్టామని సీఐడీ తెలిపిందని, అలాంటప్పుడు మళ్లీ కస్టడీ ఎందుకని వారు వాదించారు.