Asianet News TeluguAsianet News Telugu

అలా పిలిస్తే వేరే స్టోరీ అల్లి రాయించుకుంటావా: చంద్రబాబుపై విజయసాయి

ప్రమాణ స్వీకారానికి జగన్ గారు హుందాగా ఆహ్వానిస్తే దానికి వేరే స్టోరీ అల్లి మీడియాలో రాయించుకుంటావా? మీ సలహాలు అవసరం, మీరు అనువజ్ణులు అని, ఆయన అనని మాటలు పుట్టిస్తారా? మీ అనుభవం దోచుకోవడానికి మాత్రమే ఉపయోగించావని గ్రహించే యువనేతకు పట్టం కట్టారు ప్రజలు. 

vijayasaireddy slams tdp president chandrababu naidu
Author
Vijayawada, First Published May 30, 2019, 11:28 AM IST

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి తన ప్రమాణ స్వీకారానికి ఎంతో హుందాగా ఆహ్వానిస్తే వేరే స్టోరీ అల్లి అనుకూల మీడియాలో జగన్ అనని మాటలు కూడా అన్నట్లు రాయించుకుంటావా అంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. 

ప్రమాణ స్వీకారానికి జగన్ గారు హుందాగా ఆహ్వానిస్తే దానికి వేరే స్టోరీ అల్లి మీడియాలో రాయించుకుంటావా? మీ సలహాలు అవసరం, మీరు అనువజ్ణులు అని, ఆయన అనని మాటలు పుట్టిస్తారా? మీ అనుభవం దోచుకోవడానికి మాత్రమే ఉపయోగించావని గ్రహించే యువనేతకు పట్టం కట్టారు ప్రజలు. 

నువ్వు మారవు బాబూ అంటూ ధ్వజమెత్తారు. దేనిలో అనుభవజ్ణుడివి చంద్రబాబూ? కుట్ర, కుతంత్రాలు, వెన్నుపోటు, నయవంచన, ప్రజాధనాన్ని లూటీ చేయడంలో తప్ప మీకు ఎందులో అనుభవం ఉంది బాబూ. చిత్తుగా ఓడిన తర్వాత కూడా అబద్ధాలతో ఆత్మవంచన చేసుకుంటున్నావు. 

మీ సలహా  విన్న వారంతా ఏమయ్యారో తెలిసి కూడా మిమ్మల్ని అడుగుతారా బాబూ? మీ పిచ్చిగాని అంటూ విరుచుకుపడ్డారు. మరోవైపు 23 సీట్లకు పతనమైన తర్వాత అయినా పరివర్తన వస్తుందనుకుంటే ఇంకా మీకు రాలేదేంటి బాబూ. 

అనుకూల మీడియా ఉందని మీ కలలు, ఊహలన్నిటిని రాయించుకుని తృప్తి పడుతున్నారా? జూన్ 8 వరకు పదవీ కాలం ఉందని ఇంకా నమ్ముతున్నారా ఏంటి ఖర్మకాలి అంటూ విరుచుకుపడ్డారు. ప్రజల ఆగ్రహం వల్ల ఓడిపోలేదట. 

సానుభూతి వల్లనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలిచిందని తేల్చాడు రాజకీయ మ్యానిపులేటర్ చంద్రబాబు. కిందపడ్డా నేనే గెలిచా అన్నట్టుంది ఆయన వాలకం. గెలిచిన పార్టీకి 50 శాతం ఓట్లు పడిన చరిత్ర ఉందా. దీన్ని సింపతీ అంటారా? మానసిక స్థితి ఇంకా దిగజారినట్టుందంటూ నిప్పులు చెరిగారు. 

జగన్ గారు అత్యున్నత సంప్రదాయాన్ని పాటించి స్థానిక/జాతీయ నేతలు, ఇతర రాష్ట్రాల సిఎంలను ఫోన్ ద్వారా ఆహ్వానించే సమయంలో నేను పక్కనే ఉన్నా. మీకూ నాముందే ఫోన్ చేసారు. కానీ ఆయన మీ అనుభవం, సలహాలు అవసరం అనే మాటలే వాడలేదు. 

ఆయన అనని మాటల్ని అన్నట్టు ప్రచారం చేసుకునేంత నీచానికి దిగారు అంటూ మండిపడ్డారు. ఇకపోతే విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్నీ చంద్రబాబు ప్రభుత్వం దివాలా తీయించిందని ఆరోపించారు. 

అమ్మవారి పేరున రూ.140 కోట్ల డిపాజిట్లు ఉండగా స్థల సేకరణ, విస్తరణ పనుల పేరుతో రూ.122 కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. ప్రస్తుతం 18 కోట్లు మాత్రమే మిగిలాయని దేవతలను కూడా వదిలిపెట్టలేదేమి చంద్రబాబూ! అంటూ విజయసాయిరెడ్డి విరుచుకుపడ్డారు. 

 

Follow Us:
Download App:
  • android
  • ios