అమరావతి: మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి  సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేదికగా గంటాను ఉద్దేశించి విజయసాయిరెడ్డి ఈ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గంటా శ్రీనివాసరావు పేరు ఎత్తకుండానే ఆయనపై విమర్వలు గుప్పించారు.

 


విశాఖ స్టీల్ ఉద్యమానికి కొందరు గంటలు కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్తుత్తి రాజీనామాతో స్వంత గంట మోగిస్తున్నారు. ఆ గంటలో రణగొణధ్వనులు తప్ప చిత్తశుద్ది లేదన్నారు.ఆ గంట శబ్దాల వెనకున్న ప్రయోజనాలు అసలు ఉద్యమకారులకు తెలియదా అని ఆయన ప్రశ్నించారు. ఈ  గంటే గతంలో విశాఖలో భూగంట మోగించలేదా అంటూ ఆయన సెటైర్లు గుప్పించారు.