వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విట్టర్ వేధికగా ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పై విమర్శలు చేశారు. ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల, అతని కుటుంబసభ్యులపై గత కొంతకాలంగా పలు ఆరోపణలు ఎదురౌతున్న సంగతి తెలిసిందే. కాగా... ఈ విషయంపై విజయసాయి చంద్రబాబుని ప్రశ్నించారు.

‘‘కొడుకు, కుమార్తెలను బందిపోట్లుగా మార్చిన మాజీ స్పీకర్ కోడెలను పార్టీ నుంచి బహిష్కరించే దమ్ముందా చంద్రబాబూ గారూ? ఆ కుటుంబం బలవంతపు వసూళ్లతో వందల కోట్లు దోచుకుంది. అనేక మంది బాధితులు మిమ్మల్ని కలిసి వేడుకున్నా పట్టించుకోలేదని అంటున్నారు. మీకూ అందులో వాటా ఉందా ఏమిటి కొంపదీసి?’’ అని ట్విట్టర్ వేధికగా ప్రశ్నించారు. మరి ఈ ట్వీట్ కి టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.