ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చరిత్రలోకి ఎక్కారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. ట్విట్టర్ వేదికగా జగన్ పై విజయసాయి రెడ్డి ప్రశంసలు కురిపించారు.  ఇటీవల పోలీసులకు వీక్లీ ఆఫ్ ప్రకటిస్తూ... ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ చేసిన సాహసమిదని విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.

‘‘వీక్లీ ఆఫ్ అమలు చేయడం ద్వారా పోలీసు సిబ్బంది విషయంలో మానవతను చాటుకున్నసిఎంగా జగన్ గారు చరిత్రలో నిలిచి పోతారు. దేశంలోనే ఇటువంటి సాహసం చేసిన మొదటి రాష్ట్రంగా ఏపీ రికార్డు సృష్టించింది. మీ సీఎం మాటిస్తే వెనక్కు తగ్గరంట గదా అని పలువురు ఎంపీలు సెంట్రల్ హాల్‌లో నాతో అన్నారు.’’ అని ట్వీట్ చేశారు.