విశాఖపట్టణం:విశాఖపట్టణంలో తాను నివాసం ఉంటున్న త్రిబుల్ బెడ్‌రూమ్ ప్లాట్ తప్ప తనకు కానీ తన కుటుంబసభ్యులకు కానీ ఆస్తులు లేవని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటించారు. 

గురువారం నాడు విజయసాయిరెడ్డి విశాఖపట్టణంలో విశాఖ కలెక్టరేట్ లో విశాఖ ఉత్సవ్  ఏర్పాట్లు పై రాజ్య సభ సభ్యుడు విజయ సాయి రెడ్డి సమీక్ష  సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. 

విశాఖపట్టణంలో తనకు కానీ, తన కుటుంబసభ్యులకు కానీ ఎలాంటి ఆస్తులు కూడ లేవన్నారు. మరో వైపు తన భాగస్వామ్యంలో కూడ ఎలాంటి వ్యాపారాలు లేవన్నారు. తాను ఏ వివాదంలో కూడ తలదూర్చలేదన్నారు.తనకు ఆస్తులు పెంచుకోవాల్సిన అవసరం లేదన్నారు. తాను ఏ వివాదంలో కూడ తలదూర్చలేదన్నారు.

తాను ఏ అధికారిని కూడ పనులు చేయాలని కోరలేదన్నారు. తన పేరు చెప్పి ఇక్కడ అధికారులను, వ్యవస్థల పై వత్తిడి తెస్తే అలాంటి వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని పోలీసులను. విజయసాయిరెడ్డి కోరారు. 

Also read:మూడు రాజధానుల చిచ్చు:టీడీపీకి మాజీ ఎమ్మెల్యే రహమాన్ రాజీనామా

విశాఖ కు సీఎం జగన్ ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గా గొప్ప బహుమతి ఇచ్చారని విజయసాయిరెడ్డి చెప్పారు. ఎగ్జిక్యూటివ్ కాపిటల్ గా విశాఖ ను ప్రకటించిన తరవాత సీఎం తొలి సారిగా 28న పర్యటిస్తున్నారని విజయసాయిరెడ్డి చెప్పారు. 

విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధానిని ప్రకటించిన సీఎం వైఎస్ జగన్‌కు విశాఖ వాసులు తరుపున కృతజ్ఞతలు తెలుపుతూ ఎయిర్ పోర్ట్ నుంచి నగరం వరకు మానవ హారం నిర్వహించనున్నట్టుగా విజయసాయిరెడ్డి ప్రకటించారు.

విశాఖపట్టణంలోని విఎంఆర్డీఏ , జివిఎంసి కు చెందిన పలు అభివృద్ధి కార్య క్రమాలకు సీఎం జగన్ ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. విశాఖ ఉత్సవ్ లో లేజర్ షో ..ప్రముఖ సాంస్కృతిక ప్రముఖులతో కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.