నమ్మకద్రోహం అనేది పురంధేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉంది..విజయ్ సాయి సెటైరికల్ ట్వీట్...
విలువలు లేని రాజకీయాలకు పురంధేశ్వరి పాల్పడుతున్నారని, ఇలాంటి వారినే మోసగాళ్లకు మోసగాళ్లు అంటారని జయ్ సాయి రెడ్డి సెటైర్లు వేశారు.

అమరావతి : ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై మరోసారి విరుచుకుపడ్డారు వైసీపీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి. గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య మాటకు మాట యుద్ధం నడుస్తోంది. చంద్రబాబునాయుడు అరెస్ట్, బెయిల్ విషయంలో పురంధేశ్వరి స్పందనలపై విజయ్ సాయి రెడ్డి సెటైర్లు వేస్తున్నారు. అదే సమయంలో పురంధేశ్వరి కూడా ఆయన మీద సుప్రీంకోర్టు సీజేఐకి లేఖ కూడా రాశారు.
తాజాగా సోమవారం విజయ్ సాయి రెడ్డి పురంధేశ్వరిపై మరో సంచనల ట్వీట్ చేశారు. విలువల్లేని రాజకీయాలకు చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలో ఉంటారని..బావ పార్టీ సేవలో తరిస్తుంటారని.. ఇలాంటివారినే మోసగాళ్లకు మోసగాళ్లు అంటారంటూ ఎద్దేవా చేశారు.
ఏపీ, తెలంగాణల్లో పవన్ పొత్తులు.. విలువలు లేని మీకే ఇది సాధ్యమంటూ అంబటి రాంబాబు విమర్శలు
ఆయన ట్వీట్ లో ఏముందంటే... ‘నమ్మకద్రోహం అనేది పురంధేశ్వరి గారి వ్యక్తిత్వంలోనే ఉంది. తండ్రిని కాటికి పంపిన వ్యక్తికి పార్టీలు మారడం ఒక లెక్కా. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో చేరి విలువల్లేని రాజకీయాలకు చిరునామాగా మారింది. ఇప్పుడు పేరుకు బీజేపీ అధ్యక్షురాలైనా బావ పార్టీ టీడీపీ సేవలో తరిస్తోంది. ఇలాంటి వారినే మోసగాళ్లకు మోసగాళ్లు అంటారు’ అంటూ ఘాటుగా విమర్శించారు.