సారాంశం

చంద్రబాబు-పవన్ భేటీపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు . ముఖ్యంగా పవన్ కల్యాణ్‌ను ఆయన టార్గెట్ చేశారు. ఈ మేరకు ఆదివారం రాంబాబు ఎక్స్‌లో ట్వీట్ చేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడులతో పవన్ కళ్యాణ్ వున్న ఫోటోను షేర్ చేశారు.

ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో సీట్ల పంపకం, ఉమ్మడి కార్యాచరణ తదితర అంశాలపై వీరిద్దరూ చర్చించినట్లుగా తెలుస్తోంది. చంద్రబాబు-పవన్ భేటీపై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు . ముఖ్యంగా పవన్ కల్యాణ్‌ను ఆయన టార్గెట్ చేశారు. ఈ మేరకు ఆదివారం రాంబాబు ఎక్స్‌లో ట్వీట్ చేశారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడులతో పవన్ కళ్యాణ్ వున్న ఫోటోను షేర్ చేశారు. ‘‘విలువలు లేని తమకే ఇది సాధ్యం’’ అంటూ అంబటి రాంబాబు చురకలంటించారు. 

కాగా.. చంద్రబాబు నాయుడును శనివారం పవన్ కల్యాణ్ పరామర్శించారు. ఏపీ స్కిల్‌‌ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు.. అనారోగ్య కారణాల నేపథ్యంలో మధ్యంతర బెయిల్‌‌పై విడుదలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైద్య చికిత్స కోసం చంద్రబాబు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఇక, ఈరోజు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌‌లో చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్ చేరుకున్నారు. ఈ సందర్భంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న చంద్రబాబును పరామర్శించారు. పవన్ కల్యాణ్‌తో జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ కూడా చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల్లో పోటీ, ఏపీ రాజకీయ పరిణామాలపై కూడా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌ల మధ్య చర్చకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఏపీలో టీడీపీ, జనసేన సంయుక్తంగా క్షేత్రస్థాయిలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కూడా ఇరువురు నేతలు చర్చలు జరిపినట్టుగా సమాచారం. అదే విధంగా చంద్రబాబుపై ఏపీ సీఐడీ నమోదు చేస్తున్న వరుస కేసులపై కూడా ఈ సందర్భంగా చర్చ సాగినట్టుగా తెలుస్తోంది.