ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి మండిపడ్డారు. 

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి మండిపడ్డారు. ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకోవడాన్ని ట్విట్టర్ లో ప్రశ్నించారు.

‘ఎంత డబ్బు అయినా పంపిస్తా, టీఆర్‌ఎస్‌ మాత్రం గెలవొద్దంటూ తెలంగాణ కాంగ్రెస్‌ పెద్దలకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నాడట. ఇంత ప్రేమ ఎందుకంటే కేసీఆర్‌ మళ్లీ గెలిస్తే ఓటుకు నోటు కేసు విచారణ స్పీడప్‌ చేసి ఎక్కడ లోపల వేస్తాడోనని చంద్రబాబుకు భయం పట్టుకుంద’ని ట్విట్టర్ లో ఎద్దేవా చేశారు.