ఏపీ ప్రభుత్వాసుపత్రుల్లో విజిలెన్స్ సోదాలు: ఉద్యోగుల హాజరు, మందుల స్టాక్ పై ఆరా

ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలోని  పలు జిల్లాల్లోని ప్రభుత్వాసుపత్రుల్లో  విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆసుపత్రుల్లో సిబ్బంది హజరు, మందుల స్టాక్ తదితర విషయాలపై ఆరా తీశారు విజిలెన్స్ అధికారులు.

vigilance officers Raids in Several government hospitals in Andhra Pradesh

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో గురువారం నాడు విజిలెన్స్  అధికారులు సోదాలు నిర్వహించారు.రాష్ట్రంలోని పలు జిల్లాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు. ఉమ్మడి కడప జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో  విజిలెన్స్ దాడులు కొనసాగాయి. జిల్లాలోని రాజంపేట, ప్రొద్దుటూరు, నందలూరు ప్రభుత్వాసుపత్రుల్లో సోదాలు చేశారు. ఉద్యోగుల హజరు, మందుల నిల్వలు, సిబ్బంది కొరత,పనితీరుపై విజిలెన్స్ అధికారులు ఆరా తీశారు.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో తుని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో విజిలెన్స్ తనిఖీలు. మందుల నిల్వలు, రోగులకు చికిత్స, విజిలెన్స్ పై ఆరా తీశారు. విశాఖలోని ఆరిలోవ నిమ్స్ ఆసుపత్రిలో విజిలెన్స్  అధికారులు సోదాలు చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మరింత మెరుగైన సేవలు అందించాలని భావిస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఆసుపత్రులకు ప్రభుత్వం  నుండి అందిన మందుల స్టాక్, పరికరాల వంటి వాటిపై కూడా విజిలెన్స్ అధికారులు సోదాలు చేశారు.  చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలు సరిగా లేవని వైసీపీ ఆరోపణలు చేసింది. అయితే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత  పేద ప్రజలు ప్రభుత్వాసుపత్రుల్లో  మెరుగైన వసతులు కల్పిస్తామని వైసీపీ ప్రకటించిన విషయం తెలిసిందే. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios