గన్నవరం సివిల్ సప్లై గోడౌన్ లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. సీఐ అపర్ణ, చెన్నయ్య డిప్యుటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఈ సోదాలు నిర్వహించారు. కాగా.. గోడౌన్ సిబ్బంది రికార్డుల్లో సరుకు తక్కువగా చూపించినట్లు సోదాల్లో తేలింది. గోడౌన్ లో సరుకుల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయని వచ్చిన సమాచారం మేరకు అధికారులు సోదాలు నిర్వహించారు.

ఆకస్మిక దాడులు చేయడంతో.. గోడౌన్ సిబ్బంది అడ్డంగా దొరికిపోయారు. కేసు నమోదు చేసి సరుకును స్వాధీనం చేసుకున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.