Asianet News TeluguAsianet News Telugu

సింహాచలం కొండపై అక్రమాలు: మాజీ ఈవో బాగోతంపై రంగంలోకి విజిలెన్స్

సింహాచలం దేవస్థానం ఈవోగా ఎం.వెంకటేశ్వరరావు పనిచేసిన కాలంలో చోటు చేసుకున్న అక్రమ తవ్వకాలు, ఇతర అంశాలపై విజిలెన్స్‌ శాఖ విచారణ చేపట్టింది. 

vigilance department investigation on ex eo of simhachalam temple
Author
Simhachalam, First Published Aug 19, 2020, 2:36 PM IST

సింహాచలం దేవస్థానం ఈవోగా ఎం.వెంకటేశ్వరరావు పనిచేసిన కాలంలో చోటు చేసుకున్న అక్రమ తవ్వకాలు, ఇతర అంశాలపై విజిలెన్స్‌ శాఖ విచారణ చేపట్టింది. ముఖ్యంగా దేవస్థానం భూములు, ఘాట్ రోడ్డులో తవ్విన గ్రావెల్‌ సందర్భంగా చోటు చేసుకున్న అక్రమాలపై విజిలెన్స్ ఆరా తీస్తోంది.

ఇక్కడి కొండను ఎంత తవ్వారు? వీటికి అనుమతులున్నాయా.. ఉంటే ఆ మేరకే తవ్వకాలు జరిగాయా? గ్రావెల్‌ను ఎక్కడికి తరలించారు? ఇలా పలు అంశాలు పరిశీలిస్తామని విజిలెన్స్ ఏఎస్పీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. వీటి ఆధారంగా మిగిలిన అంశాలపైనా దర్యాప్తు చేస్తామని,  పూర్తి స్థాయిలో విచారణ చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రసిద్ధ దేవాలయం సింహాచలం శ్రీ వరాహా లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి ఈవోగా పనిచేస్తున్న వెంకటేశ్వరరావుపై బదిలీ వేటు పడిన సంగతి తెలిసిందే.

ఆయన అనేక అక్రమాలకు పాల్పడ్డారంటూ దేవాదాయ శాఖ ఎస్టేట్ ఆజాద్ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. దీని ఆధారంగా ఈవో వెంకటేశ్వరరావుపై ప్రభుత్వం  బదిలీ వేటు వేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios