అల్లూరి జిల్లాలో వింత: చెట్టు నుండి జలధార

అల్లూరి జిల్లాలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో  కొన్ని చెట్లకు రంధ్రం చేయగానే  జలధార బయటకు వస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 Video of water from wild tree in AP goes viral  lns

విశాఖపట్టణం: అల్లూరి జిల్లాలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో  చెట్టుకు రంద్రం చేయగానే  ఆ చెట్టు నుండి నీళ్లు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

వేసవికాలంలో సాధారణంగా చెట్లు ఆకులు రాలుస్తాయి.  కొన్ని చెట్లు ఎండిపోతాయి.  కానీ అందుకు భిన్నంగా  కింటుకూరు అటవీ ప్రాంతంలో చెట్ల నుండి నీళ్లు బయటకు వస్తున్నాయి.

 

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని రంపచోడవరం మండలం కింటుకూరు అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. నల్లమద్ది చెట్టుకు రంద్రం చేస్తే  ఆ చెట్టు నుండి నీరు ధారగా వస్తుంది.  పైప్ నుండి నీరు ధారగా వచ్చినట్టుగానే  నీళ్లు వస్తున్నాయి.   ఈ చెట్ల నుండి చుక్కలు చుక్కలుగా నీరు వస్తున్న విషయాన్ని గమనించిన అటవీశాఖాధికారులు నీళ్లు వస్తున్న ప్రాంతంలో  రంద్రం చేశారు. దీంతో  ఆ రంధ్రం నుండి  ధారగా నీళ్లు బయటకు వచ్చాయి.

పాపికొండలు నేషనల్ పార్క్ పరిధిలో  నల్లమద్ది చెట్లు వేల సంఖ్యలో ఉన్నాయి.  అయితే  నల్లమద్ది చెట్లలో  కొన్ని నీటిని వెదజల్లే లక్షణాలు కలిగి ఉంటాయని అటవీశాఖాధికారులు చెబుతున్నారు.  కొన్ని చెట్లు తమకు కావాల్సిన నీటిని  భూమి నుండి తీసుకొని కాండంలో నిల్వ ఉంచుకొంటాయి. ఇలా నిల్వ ఉంచిన నీరే  చెట్టుకు రంద్రం చేయగానే బయటకు వస్తుందని  అటవీశాఖాధికారులు  వివరించారు.ఒక్కో నల్లమద్ది చెట్టు నుండి కనీసం 10 నుండి 20 లీటర్ల నీరు బయటకు వస్తుందని  అటవీశాఖాధికారులు వివరించారు.

నల్లమద్ది చెట్ల నుండి నీరు బయటకు రావడాన్ని  అటవీశాఖాధికారులు జి.నరేంద్రియన్, ఇందుకూరు రేంజ్ అధికారి దుర్గాకుమార్ పరిశీలించారు.సాధారణంగా భూగర్భజలాలు పెరిగితే  బోర్ల నుండి  నీళ్లు ఉబికి రావడం చూసే ఉంటాం. కానీ, వేసవిలో కూడ నల్లమద్ది చెట్ల నుండి ఇలా నీళ్లు ఉబికి వస్తున్న  వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios