తిరుపతి: తిరుపతి రైల్వే స్టేషన్లో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సీరియస్ అయ్యారు. ఈనెల 9న నెల్లూరు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయన ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ నుంచి ఉపరాష్ట్రపతి రైలులో నెల్లూరు జిల్లా వెంకటాచలం చేరుకుంటారు. 

అందులో భాగంగా ఆయన రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుపతి రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. అయితే ప్రోటోకాల్ ఏర్పాటు సరిగ్గా చెయ్యకపోవడంతో ఆయన అసహనం వ్యక్తం చేశారు. తన ప్రయాణానినికి సంబంధించి ఏర్పాట్లు ఎవరు చేస్తున్నారంటూ అడిగారు. 

ఆ అధికారి రావడంతో కామన్ సెన్స్ ఉందా అంటూ మండిపడ్డారు. ఇదేనా ప్రోటోకాల్ అంటూ సున్నితంగా మందలించారు. అనంతరం ఆయన రైలులో నెల్లూరు జిల్లాకు బయలు దేరారు. బుధవారం అంటే ఈనెల 9న శ్రీరామపురం చేరుకుని మధ్యాహ్నం వరకు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. 

"