ఏపిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని తిరుపతి సభలో మోడి ఇచ్చిన హామీని గుర్తు చేసారు. మోడి చెప్పినట్లుగా ఇచ్చిన హామీ ప్రకారం 99 శాతం నెరవేరుస్తమాని మళ్లీ వీరిద్దరూ హామీ ఇచ్చారు.
అదేదో సినిమాలో ‘ఆ ఒక్కటి తప్ప’ అని అన్నట్లుగా వెంకయ్యనాయుడు కూడా ‘ప్రత్యేకహోదా తప్ప మిగిలిన వన్నీ ఇస్తామం’టూ చెబుతున్నారు. నిన్న మీడియాతో కేంద్రమంత్రులు సురేష్ ప్రభు, వెంకయ్యలు మాట్లాడుతూ, ప్రత్యేకహోదా గురించి మాట్లాడే నైతిక హక్కు రాహూల్ గాంధికి లేదన్నారు. ప్రత్యేకహోదా గురించి మాట్లాడే హక్కు అసలు ఎవరికి ఉన్నట్లు? ఆమాటకు వస్తే నైతిక హక్కు భాజపాకు మాత్రం ఏముంది?
ఏపిని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని తిరుపతి సభలో మోడి ఇచ్చిన హామీని గుర్తు చేసారు. మోడి చెప్పినట్లుగా ఇచ్చిన హామీ ప్రకారం 99 శాతం నెరవేరుస్తమాని మళ్లీ వీరిద్దరూ హామీ ఇచ్చారు.
ఇక, మధ్యప్రదేశ్ లో జరిగిన రైతు కాల్పుల ఘటనపై వెంకయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ అనవసరంగా రాద్దాంతం చేస్తోందట. కాంగ్రెస్ హయాంలో గతంలో పోలీసులు కాల్పుల్లో 24 మంది రైతులు మరణించలేదా అంటూ వెంకయ్య ఎదురు ప్రశ్నించారు. అప్పుడు వారి హయాంలో రైతులు మరణించారు కాబట్టి ఇప్పడు జరిగిన కాల్పుల గురించి కాంగ్రెస్ మాట్లాడకూడదట. ఎలాగుంది వెంకయ్య లాజిక్? మొత్తానికి మోడి మూడేళ్ళ పాలన కాంగ్రెస్, విపక్షాలపై ఎదురుదాడులతోనే నెట్టుకొస్తోంది. ఇంకో రెండేళ్ళ పాలనలో ఏం జరుగుతుందో చూడాలి.