వేమూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024 live

Vemuru assembly elections result 2024: ఆంధ్రప్రదేశ్ లోని ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గాల్లో వేమూరు ఒకటి. ఇక్కడి నుండి తొలిసారి గెలిచినా జగన్ మంత్రివర్గంలో చోటుదక్కించుకకున్నారు మేరుగ నాగార్జున. ఈసారి వేమూరులో హోరాహోరీ పోరు వుండటంతో ఫలితాలు ఎలా వుండనుందోనన్న ఆసక్తి అందరిలో నెలకొంది. 

Vemuru assembly elections result 2024 ... Andhra Pradesh Assembly Elections 2024 krj

Vemuru assembly elections result 2024: వేమూరు నియోజకవర్గంపై టిడిపికి మంచి పట్టువుందని గత ఎన్నికల ఫలితాలే చెబుతున్నాయి. 1982 లో టిడిపి ఆవిర్భావంతో కాంగ్రెస్ ను వీడిన నాదెండ్ల భాస్కరావు వేమూరు టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి ఎన్టీఆర్ కేబినెట్ ఆర్థికమంత్రిగా పనిచేసారు. ఇదే సమయంలో ఎన్టీఆర్ పై తిరుగుబాటు చేసి నెలరోజులు ముఖ్యమంత్రి కూడా అయ్యారు. ఇలా నెలరోజుల ముఖ్యమంత్రిని ఉమ్మడి రాష్ట్రానికి అందించిన ఘనత వేమూరుకు దక్కుతుంది. 

నాదెండ్ల తరువాత కూడా వేమూరులో టిడిపి హవా కొనసాగింది. ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో నక్కా ఆనంద్ బాబు రెండుసార్లు (2009, 14) బరిలోకి దిగి గెలిచారు. కానీ 2019 అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపిని ఓడించి వైసిపి జెండాను వేమూరుపై ఎగరేసారు మేరుగ నాగార్జున. 

వేమూరు నియోజకవర్గ పరిధిలోని మండలాలు : 

వేమూరు
కొల్లూరు 
సుందూర్ 
భట్టిప్రోలు
అమృతలూరు  

వేమూరు అసెంబ్లీ ఓటర్లు (2019 ఎన్నికల ప్రకారం) 

వేమూరు నియోజకవర్గంలో మొత్తం 195274 ఓట్లు నమోదయ్యాయి. 

ఇందులో పురుషులు - 95,339 

మహిళలు - 99,929 

వేమూరు నియోజకవర్గ ఎన్నికలు 2024 - ప్రధాన పార్టీల అభ్యర్థులు : 
 
వైసిపి ‌- వరికూటి అశోక్ బాబు  

టిడిపి - నక్కా ఆనంద్ బాబు  


వేమూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు : 

వేమూరు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024

వేమూరు నియోజకవర్గంలో తెలుగు పార్టీ గెలుపొందింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అశోక్‌బాబు వరికూటిపై టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు విజయం సాధించారు. అశోక్ బాబు వరికూటికి 72901 ఓట్లు రాగా  నక్కా ఆనందబాబుకు 94922 ఓట్లు వచ్చాయి.

వేమూరు అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు : 

నియోజకవర్గంలో నమోదైన మొత్తం ఓట్లు - 1,95,274 

పోలైన ఓట్లు - 1,71,618 (87 శాతం) 

వైసిపి - మేరుగ నాగార్జున - 81,671 (47 శాతం) - 9,999 ఓట్ల మెజారిటీతో విజయం 

టిడిపి - నక్కా ఆనంద్ బాబు - 71,672 (41 శాతం) - ఓటమి 

జనసేన - అప్పికట్ల భరత్ భూషణ్ - 13,038 (7  శాతం) 

వేమూరు అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు : 

నియోజకవర్గంలో నమోదైన మొత్తం ఓట్లు - 1,85,485

పోలైన ఓట్లు - 1,58,723 (85 శాతం)

టిడిపి - నక్కా ఆనంద్ బాబు - 77,222 (48 శాతం) - 2,127 ఓట్ల మెజారిటీతో విజయం 

వైసిపి - మేరుగ నాగార్జున - 75,095 (47 శాతం) -  ఓటమి 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios