ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్‌లో రూపాయి అవినీతి జరగలేదన్నారు టీడీపీ ప్రభుత్వానికి ఐటీ సలహదారుగా వ్యవహరించిన వేమూరి హరిప్రసాద్. ఫైబర్ గ్రిడ్‌లో అవినీతి జరిగిందంటున్న ప్రభుత్వం ఆధారాలు ఎందుకు చూపించడం లేదని ఆయన ప్రశ్నించారు.

తన ప్రమేయంతో అవినీతి నిరూపిస్తే... ఏ శిక్షకైనా సిద్ధమని, ఆరోపణలు చేసిన వారు అందుకు సిద్ధమా అని వేమూరి సవాల్ విసిరారు. దీనిపై ఎవరు వ్యాఖ్యలు చేసినా, తన దగ్గర సమాధానం వుందని ఆయన స్పష్టం చేశారు.

Also Read:బాబుకి షాక్: గత ప్రభుత్వ నిర్ణయాలపై సీబీఐ విచారణకు ఏపీ కేబినెట్ నిర్ణయం

కాగా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ విచారణ జరపాలని గురువారం జరిగిన సమావేశంలో ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకలపై కేబినెట్ సబ్ కమిటీ నివేదికను సీఎం జగన్‌కు అందజేసింది.

అర్హత లేని సంస్థలకు ప్రాజెక్టులను కట్టబెట్టారని కేబినెట్ సబ్ కమిటీ పేర్కొంది. సెటాప్ బాక్సుల కొనుగోళ్లలోనూ భారీ కుంభకోణం జరిగినట్లు పేర్కొంది. ఫైబర్ నెట్‌లో సుమారు రూ.700 కోట్ల మేర అవినీతి జరిగిందని.. చంద్రన్న తోఫా, కానుక వంటి పథకాల ద్వారా రూ.158 కోట్ల అవినీతి జరిగిందని తెలిపింది.

Also Read:హేరిటెజ్‌ మజ్జిగపై సీబీఐ విచారణ: ఏపీ కేబినెట్ నిర్ణయాలివే

అలాగే హెరిటేజ్ మజ్జిగ ప్యాకెట్ల ద్వారా ఏడాదికి రూ.40 కోట్లు అక్రమాలు జరిగినట్లు తేలడంతో హెరిటేజ్ మజ్జిక ప్యాకెట్ల సరఫరా, ఖర్చులపై సీబీఐ విచారణ జరపాలని కేబినెట్ నిర్ణయించింది.