విజయవాడ:  శ్రీ రాజ రాజేశ్వరి దేవిగా ఆదివారం దసరా ఉత్సవాల చివరి రోజు భక్తులకు  బెజవాడ కనకదుర్గమ్మదర్శనమిస్తున్నారు. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో చివరి రోజున ఇంద్రకీలాద్రిపై భక్తులు బారులు తీరారు. ఉదయం 5 గంటల నుండే అధికారులు అమ్మవారి దర్శనం కల్పించారు. 

విజయదశమి రోజు అమ్మవారిని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు  దర్శనం చేసుకున్నారు. వెలంపల్లి శ్రీనివాసరావుకు  దేవాదాయ శాఖ కమిషనర్ పి. అర్జునరావు ఇఓ సురేష్ బాబు, నగర పోలిస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, తదితరులుదేవాదాయ శాఖ మంత్ర కి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

మంత్రికి దర్శనం చేయించి, అమ్మవారి ప్రసాదాన్ని అందచేశారు అమ్మవారి దర్శనం అనంతరం దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడారు.  కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు కట్టుదిట్టంగా చేసినట్లు తెలిపారు. అయిన్నప్పటికీ భక్తులు అమ్మవారి దసరా ఉత్సవాలను విజయవంతం చేశారని చెప్పారు. 

రాష్ట్ర ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని కరోనా మహమ్మరిని జయించాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో ఉన్న ముఖ్యమంత్రులు అమ్మవారి ఎఫ్డీలను  ఖర్చు చేశారని, ఒక్క రూపాయి కూడా ఇచ్చిన దాఖలాలు లేవని చెప్పారు..రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మనసున్న మారాజు అని, అందుకే ఆలయ అభివృద్ధి కి రూ.70 కోట్లు కేటాయించటం చాలా సంతోషంగా ఉందిని ఆయన చెప్పారు. 

అమ్మవారి దయతో అందరు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు. సమన్వయ అధికారుల కమిటీ నిర్ణయం మేరకు జల విహరం  ఉండదని, హంస వాహనం పై యధావిధిగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని మంత్రి వెల్లంపల్లి చెప్పారు.